RC 17 : వామ్మో.. చరణ్ – సుకుమార్ సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా..?
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. (RC 17)
- Saketh U
- Published on- November 5, 2026 / 04:35 PM IST
RC 17
RC 17 : మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా RC17. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పట్నుంచే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా మెగాస్టార్ చేతుల మీదుగా గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది. జనవరి సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కొన్ని సెట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాకు నాలుగు భారీ సెట్స్ వేస్తున్నారట. అలాగే గ్రాఫిక్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. దీంతో సెట్స్, విజువల్స్ కే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇక మెయిన్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కూడా భారీగానే ఉంటాయి. RC17 సినిమాకు దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నట్టు టాలీవుడ్ లో వినిపిస్తుంది.
రంగస్థలం తర్వాత సుకుమార్ – రామ్ చరణ్ కాంబో కావడం, పాన్ ఇండియా సినిమా కావడంతో అంత బడ్జెట్ పెట్టి భారీగా తీసి భారీగానే కలెక్ట్ చేస్తారని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. బాలీవుడ్ భారీ సంస్థ T సిరీస్ ఫిలిమ్స్ బ్యాకప్ ఇస్తుంది.
