ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు.. ఉపాసనకు చెర్రీ బర్త్‌డే విషెస్..

  • Publish Date - July 20, 2020 / 04:19 PM IST

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ భార్యగానే కాకుండా యువ పారిశ్రామికవేత్తగా, అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌గా, సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన కొణిదెల. ఈ రోజు (సోమవారం) ఉపాసన పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉపాసనకు విషెస్ చెప్పాడు.

‘నువ్వు చేసే సేవా కార్యక్రమాలు.. ఎంత చిన్నవైనా అవి వృథా కావు. నువ్వు ఇలాగే మంచి పనులు చేసుకుంటూ వెళితే తప్పకుండా గుర్తింపు వస్తుంది. హ్యాపీ బర్త్‌డే’ అంటూ చెర్రీ కామెంట్ చేశాడు. పువ్వుల మధ్య ఉన్న ఉపాసన ఫోటోను పోస్ట్ చేశాడు. చెర్రీతో పాటు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, సానియా మీర్జా వంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాసన బర్త్‌డే డిపిను బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు విడుదల చేశారు.