దివ్యాంగుల కోసం ఉపాసన డ్యాన్స్ టాలెంట్ షో.. చరణ్ స్పందన..

  • Published By: sekhar ,Published On : October 7, 2020 / 02:39 PM IST
దివ్యాంగుల కోసం ఉపాసన డ్యాన్స్ టాలెంట్ షో.. చరణ్ స్పందన..

Updated On : October 7, 2020 / 2:49 PM IST

Heal URLife Through Dance: అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్‌, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉండే మెగా కోడలు ఉపాసన కొణిదెల తాజాగా ‘URLife.co.in’ అనే వెల్‌నెస్ ప్లాట్‌ఫాంను కూడా స్థాపించి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలనే విషయాలను తెలియజేస్తున్నారు. అలాగే డ్యాన్స్ టాలెంట్ ఉన్న దివ్యాంగులను ప్రోత్సహించడానికి ‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ అనే ఆన్‌లైన్ టాలెంట్ షోను నిర్వహిస్తున్నారు.

ఈ షోకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ షోలో స్టార్ కొరియోగ్రాఫర్లు ఫరా ఖాన్, ప్రభు దేవా కూడా భాగం కానున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన తపస్ అనే దివ్యాంగుడికి సంబంధించిన ఓ Inspirational వీడియో షేర్ చేశారు.

పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తపస్‌లో మానసిక ఎదుగుదల లేదు. మిగతా పిల్లల్లా చురుగ్గా, ఉత్సాహంగా ఉండలేకపోయేవాడు. అయితే ఆ తర్వాత తనలో ఉన్న డ్యాన్స్ ట్యాలెంట్‌ను గుర్తించి దానికి పదునుపెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో బోలెడు ప్రదర్శనలు ఇచ్చాడు. తపస్ తరహాలోనే దివ్యాంగులైన పిల్లల్లో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ నెల 15 లోపు రిజిస్టర్ చేయించుకోవాలి.

‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడు యునిక్ డ్యాన్స్ టాలెంట్ షో ని అనౌన్స్ చేస్తున్నాను. టాలెంట్‌ ఉన్న దివ్యాంగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ‘urlife.co.in’ లో ఎంట్రీలను పొంది మీ వీడియోలను upload చేయండి..’’ అని చరణ్ కోరారు.

‘‘కొందరు దివ్యాంగుల వీడియోలను చూశా. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వారు చూపించిన టాలెంట్ అద్భుతం. వాళ్లని చూసి ఎంతో నేర్చుకున్నా. దివ్యాంగ సోదర సోదరీమణులకు అందరూ గ్రాండ్‌ వెల్‌కమ్.. ఈ షోను సక్సెస్ చేయండి..’’ అంటూ రామ్ చరణ్ కోరారు. ఉపాసన, ఫరా ఖాన్, ప్రభు దేవా కూడా ఈ వీడియోలో మాట్లాడారు.