Ram Charan and Upasana are going to Dubai for holiday trip
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కొన్ని రోజులు నుంచి బిజీ బిజీగా ఉంటున్నాడు. మొన్నటి వరకు RRR ఆస్కార్ ప్రమోషన్స్ అంటూ అమెరికాలో, వచ్చాకా గేమ్ చెంజర్ (Game Changer) మూవీ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక రెండు రోజుల నుంచి తన బర్త్ డే సెలబ్రేషన్స్ తో ప్రతి ఒకరికి అందుబాటులో ఉండి విశ్రాంతి లేకుండా ఉన్నాడు. దీంతో ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోని వెకేషన్ కి వెళ్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్, ఉపాసన (Upasana), తమ పెట్ రైమ్ ని తీసుకోని దుబాయ్ హాలిడే ట్రిప్ కి బయలుదేరారు.
Ram Charan : రామ్‌చరణ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా చేసిన ఉపాసన.. సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్..
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ పయనమయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో రామ్ చరణ్ లుక్ చూసి అందరు అదుర్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హాలీడే నుంచి తిరిగి రాగానే కంప్లీట్ ‘గేమ్ చెంజర్’ షూటింగ్ లో పాల్గొనున్నట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ గా తెరకెక్కించడంలో శంకర్ నెంబర్ వన్. ఈ మూవీలో మళ్ళీ తన మార్క్ టేకింగ్ చూపిస్తాను అని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
ఈ సినిమాకి మరో హైలైట్ ఏంటంటే.. తమిళ స్టార్ డైరెక్ట్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.