Buchibabu Sana : ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు రామ్‌చ‌ర‌ణ్ దంప‌తుల గిఫ్ట్..

రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు ఓ ప్ర‌త్యేక బ‌హుమ‌తిని పంపించారు

Ram Charan and Upasana sends special gift to director Buchibabu Sana

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు ఓ ప్ర‌త్యేక బ‌హుమ‌తిని పంపించారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదికగా బుచ్చిబాబు తెలియ‌జేశారు. ఈ బ‌హుమ‌తి త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకం అని చెప్పాడు.

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ 40వ బ‌ర్త్‌డే వేడుక‌లు ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకు చ‌ర‌ణ్ దంప‌తులు హ‌నుమాన్ చాలీసా పుస్త‌కాన్ని, హ‌నుమంతుడి ప్ర‌తిమ‌, శ్రీరాముని పాదుక‌ల‌ను పంపారు.” నా మ‌న‌సులో నీకెప్పుడు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. ఆ హ‌నుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని కోరుకుంటున్నాను.” అని రాసి ఉన్న లేఖ‌ను సైతం పంపారు.

Sukumar : సుకుమార్ కామెంట్స్‌తో కోలీవుడ్ ఫుల్ హ్యాపీ..

వీటిన్నంటికి సంబంధించిన ఫోటోల‌ను బుచ్చిబాబు త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేస్తూ.. మీ ప్రేమను ఈ బ‌హుమ‌తి తెలియ‌జేస్తుంది అంటూ రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌ను ట్యాగ్ చేశారు.

ఇదిలా ఉంటే.. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో జాన్వీక‌పూర్ క‌థానాయిక‌. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.