Ram Charan – Upasana : చరణ్, ఉపాసన చేసిన పనికి నెటిజెన్లు అభినందనలు..

రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ అందుకున్న చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైన్ వేర్ డ్రెస్ తో చరణ్ అండ్ ఉపాసన మెరిశారు. కాగా ఈ వేడుకలో..

Ram Charan and Upasana shows their temple setup to americans

Ram Charan – Upasana : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ అందుకున్న చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైన్ వేర్ డ్రెస్ తో చరణ్ అండ్ ఉపాసన మెరిశారు. కాగా ఈ వేడుకకు సిద్దమవుతున్న సమయంలో ప్రముఖ అమెరికన్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తాను ధరించే డ్రెస్ ప్రత్యేకత గురించి, ఇండియన్ డిజైనర్స్ గురించి చెప్పుకొచ్చాడు చరణ్.

RRR : RRR సీక్వెల్ పనులు వేగవంతం చేసాం.. అమెరికన్ మీడియాతో రాజమౌళి!

ఇదే ఇంటర్వ్యూలో చిన్న సీతారామ విగ్రహాలు చూపిస్తూ.. ”ప్రపంచంలో ఏ మూలకి వెళ్లిన నేను, నా భార్య ఈ విగ్రహాలని తీసుకు వెళ్తాము. ఈ చిన్న టెంపుల్ సెటప్ మమ్మల్ని మా సంప్రదాయాలతో, మా దేశంతో కనెక్ట్ చేస్తుంది అని నమ్ముతాం” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల ఒక అమెరికన్ ఇంటర్వ్యూలో కూడా అయ్యప్ప దీక్ష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేశాడు రామ్ చరణ్. తన నటనతో ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో రిప్రెజెంట్ చేయడమే కాకుండా మన కల్చర్ ని కూడా ఇతర దేశాలకు తెలిసేలా చేస్తున్న చరణ్ ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానున్నట్లు దిల్ రాజు తెలియజేశాడు. CEO, సేనాని, సైనికుడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీటిలో ఏ టైటిల్ ని కన్‌ఫార్మ్ చేస్తారో చూడాలి.