RRR : RRR సీక్వెల్ పనులు వేగవంతం చేసాం.. అమెరికన్ మీడియాతో రాజమౌళి!

RRR సీక్వెల్ గురించి రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు తెలిసిన సంగతే. తాజాగా ఆస్కార్ గెలుచుకోవడంతో అమెరికాలోని ఒక మీడియాకి రాజమౌళి అండ్ కీరవాణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని సీక్వెల్ గురించి..

RRR : RRR సీక్వెల్ పనులు వేగవంతం చేసాం.. అమెరికన్ మీడియాతో రాజమౌళి!

rajamouli comments on rrr sequel after winning oscar

RRR : బాహుబలి సినిమా తరువాత రాజమౌళి ఎటువంటి సినిమా తీస్తాడు అని అందరిలో సందేహం ఉన్న సమయంలో.. ఎవరి ఊహకి అందని రీతిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేతులు కలుపుతూ RRR సినిమాని అనౌన్స్ చేశాడు. మూవీ అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంటే.. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల కథలను జత చేస్తూ అదే సినిమా కథగా ఎంపిక చేసుకోవడంతో మూవీ పై మరింత హైప్ ని పెంచేసింది. గత ఏడాది మార్చిలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా సక్సెస్ ని కాదు, ఏకంగా పాన్ వరల్డ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

RRR : RRR ఆస్కార్ పై బాలీవుడ్ సింగర్ ట్వీట్.. సిగ్గుగా ఉంది!

వరల్డ్ టాప్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ కూడా RRR మూవీ చూసి ఫిదా అయ్యి ప్రశంసలు జల్లు కురిపించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ అందుకొని మొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆస్కార్ గెలుచుకోవడంతో అమెరికాలోని ఒక మీడియాకి రాజమౌళి అండ్ కీరవాణి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని సీక్వెల్ గురించి ప్రశ్నించారు. ఆస్కార్ గెలిచిన ఉత్సాహం సీక్వెల్ పనులు వేగవంతం చేయడానికి ఏమన్నా దోహద పడుతుందా? అని ప్రశ్నించగా, రాజమౌళి బదులిస్తూ.. ”కచ్చితంగా దోహద పడుతుంది. RRR సీక్వెల్ పనులు వేగవంతం చేస్తాం” అంటూ బదులిచ్చాడు. కాగా మొదటిలో ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచన లేదంటూ రాజమౌళి చెప్పినప్పటికీ.. ఇంటర్నేషనల్ లెవెల్ ఈ చిత్రానికి వచ్చిన ఆదరణ చూసి, ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో సీక్వెల్ తీసుకు వస్తాము అంటూ ఒక అమెరికన్ మీడియా ఛానల్ కి రాజమౌళి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ గురించి మాట్లాడడం ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.