Ram Charan : బ్యాంకాక్‌లో చిల్ అవుతున్న చరణ్, ఉపాసన.. సమ్మర్ వెకేషన్..

చరణ్, ఉపాసన కలిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లారు. వీరితో పాటు వీరి ఫ్రెండ్స్ మరో రెండు జంటలు కూడా వెళ్లారు.

Ram Charan and Upasana Went to Bangkok for Summer Vacation Photo goes Viral

Ram Charan : గేమ్ ఛేంజర్ మూవీ షూట్‌తో రామ్ చరణ్ బిజీగా ఉండగా.. ప్రస్తుతం షెడ్యూల్ గ్యాప్ వచ్చింది. ఈ షెడ్యూల్ గ్యాప్ లో చరణ్, ఉపాసన(Upasana) కలిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లారు. వీరితో పాటు వీరి ఫ్రెండ్స్ మరో రెండు జంటలు కూడా వెళ్లారు. అందరూ కలిసి బ్యాంకాక్ లో చిల్ అవ్వడానికి సమ్మర్ వెకేషన్ గా ప్లాన్ చేసుకున్నారు.

ఇక చరణ్ తో పాటు ఎప్పుడూ తన వెంటే ఉండే తన పెంపుడు కుక్కపిల్ల రైమ్ కూడా బ్యాంకాక్ కి వెళ్ళింది. చరణ్ వెకేషన్ కి వెళ్లేముందు ఫ్లైట్ లో చరణ్, రైమ్ కూర్చొని దిగిన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా రైమ్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ట్రిప్ కి వెళ్లి అందరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసారు.

Also Read : Chiranjeevi – Ram Charan : చూసుకోరు వెధవలు.. చరణ్‌ని అంత మాట అనేశాడేంటి చిరంజీవి.. మిడిల్ క్లాస్ కష్టాలు చెప్తూ..

ఈ ఫొటోలో చరణ్, ఉపాసన తో పాటు వీరి ఫ్రెండ్స్ బ్యాంకాక్ లో సముద్రం పక్కన ఉన్న ఓ రిసార్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలాంటి ట్రిప్స్ కి వెళ్తే ఉపాసన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. మరి ఈ బ్యాంకాక్ వెకేషన్ నుంచి ఇంకేమైనా ఫొటోలు షేర్ చేస్తారా? చరణ్ ఫొటోలు కూడా ఏమైనా షేర్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.