Ram Charan : ఆస్కార్ వేడుకలకు ముందు.. లాస్ ఏంజిల్స్ లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన రామ్ చరణ్.. భారీగా అభిమానులు..

తాజాగా రామ్ చరణ్ నేడు ఉదయం లాస్ ఏంజిల్స్ లో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించాడు. రామ్ చరణ్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కి భారీగా అభిమానులు తరలివచ్చారు. అక్కడ...........

Ram Charan Arranged Fans meet in Los Angeles huge fans attended

Ram Charan :  ప్రపంచం సంగతేమో కానీ ఇండియా అంతా ఇప్పుడు ఆస్కార్ అవార్డుల వేడుక కోసమే ఎదురు చూస్తుంది. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. దీనితో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి. దీంతో ఈ సారి ఇండియన్స్ కి ఆస్కార్ మీద మరింత ఫోకస్ ఎక్కువైంది. ఈ మూడు కూడా ఆస్కార్ అవార్డులు సాధించాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కార వేడుకలు మార్చి 12న జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది.

ఇక RRR యూనిట్ ఆస్కార్ వేడుకలకు పది రోజుల ముందునుంచే అమెరికాలో సందడి చేస్తున్నారు. తమ పాటని, సినిమాని ప్రమోట్ చేస్తూ, వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముందుండి RRR ని మరింత ప్రమోట్ చేస్తున్నారు. హీరోలు ఫ్యాన్స్ మీట్స్ పెట్టడం ఇటీవల మన దగ్గర కామన్ అయింది. కానీ ఇప్పుడు ఆస్కార్ వేడుకలు ఉండటంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏకంగా అమెరికాలో ఫ్యాన్స్ మీట్స్ పెడుతున్నారు.

Oscar 2023 : ఆస్కార్ రెడ్ కార్పెట్ మార్చడానికి కారణం విల్ స్మిత్?

ఇటీవలే ఎన్టీఆర్ కాలిఫోర్నియాలో ఫ్యాన్స్ మీట్ పెట్టగా అమెరికాలో ఉన్న ఇండియన్ అభిమానులతో పాటు అక్కడి అభిమానులు కూడా భారీగా వచ్చారు. తాజాగా రామ్ చరణ్ నేడు ఉదయం లాస్ ఏంజిల్స్ లో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించాడు. రామ్ చరణ్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కి భారీగా అభిమానులు తరలివచ్చారు. అక్కడ నివసించే ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు రామ్ చరణ్ హాలీవుడ్ అభిమానులు కూడా వచ్చారు. వారందరితో రామ్ చరణ్ మాట్లాడి, ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అలాగే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్ లో అభిమానులతో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.