Ram Charan : మొన్న ఎన్టీఆర్.. ఇప్పుడు చరణ్.. కొత్త హీరో కోసం వస్తున్న మెగా పవర్ స్టార్.. లైవ్ కాన్సర్ట్ ఎప్పుడు? ఎక్కడ?

ఈ కొత్త హీరో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్, అనిరుధ్ రాబోతున్నారట. (Ram Charan)

  • Published on- November 9, 2026 / 02:41 PM IST

Ram Charan

Ram Charan : ఇట్లు అర్జున సినిమాతో అనీష్ రెడ్డి అనే కొత్త హీరో సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే నాగార్జున ప్రమోషన్స్ కి వచ్చి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఇప్పుడు ఈ కొత్త హీరో కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్, అనిరుధ్ రాబోతున్నారట.

ప్రముఖ వ్యాపారవేత్త, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేష్ రెడ్డి చిన్న కుమారుడు ఈ అనీష్ రెడ్డి. ఇతను హీరోగా గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ఇట్లు అర్జున అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుండటంతో టాలీవుడ్ అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమా నవంబర్ 13న రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్ తో లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు.

Also Read : Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ‘గోట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?

ఇట్లు అర్జున సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా పనిచేసారు. నేడు నవంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్ లోని నోవాటెల్ హైటెక్స్ లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ఈ కాన్సర్ట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. అలాగే నాగార్జున, అఖిల్ అక్కినేని కూడా హాజరు కాబోతున్నారు. తమన్, హీరోయిన్ అనశ్వర రాజన్, సినిమాలో నటించిన స్టార్స్ అంతా ఈ ఈవెంట్ కి వచ్చి సందడి చేయనున్నారు. అయితే ఈ సినిమాలో అనిరుద్ ఒక పాట పాడారు. దీంతో ఈ లైవ్ కాన్సర్ట్ లో అనిరుద్ వచ్చి తమన్ సంగీత దర్శకత్వంలో ఆ పాట పడతాడని టాక్ వినిపిస్తుంది.

ఒక కొత్త హీరో కోసం ఇంతమంది స్టార్స్ రావడం, ఇంత పెద్దగా లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తుండటంతో ఆయా హీరోల ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.