Ram Charan : రామ్‌చరణ్ ఫాలోయింగ్ మాములుగా లేదుగా.. బన్నీ, విజయ్‌ కంటే ముందుగా..

రామ్ చరణ్ తన చార్మ్‌నెస్‌తో అమ్మాయిలకు డ్రీం బాయ్, అబ్బాయిలకు యూత్ ఐకాన్ అవుతున్నారు. దీంతో చరణ్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరుగుతుంది.

Ram Charan beat Allu Arjun Vijay Deverakonda with 20M followers

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో కేవలం తనని తాను అందరికి పరిచయం చేసుకున్నారు. ఆ తరువాత తన లైఫ్ స్టైల్, అవుట్ ఫిట్స్ అండ్ లుక్స్‌తో ప్రతి ఒక్కర్ని తన ఫాలోవర్స్ గా మార్చుకున్నారు. రామ్ చరణ్ తన చార్మ్‌నెస్‌తో అమ్మాయిలకు డ్రీం బాయ్, అబ్బాయిలకు యూత్ ఐకాన్ అవుతున్నారు. దీంతో చరణ్ కి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ పెరుగుతుంది.

రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ రోజురోజుకి పెరుగుతూ పోతుంది. 10 మిలియన్, 15 మిలియన్ మార్క్ ఫాస్ట్ ఫాస్ట్ గా క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మెగాపవర్ స్టార్ 20 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశారు. అంతేకాదు ఈ మార్క్ ని చాలా ఫాస్ట్‌గా చేరుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ గా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. ఈ 20M మార్క్ ని రామ్ చరణ్ 1635 రోజుల్లో చేరుకున్నారు.

Also read : Ram Charan : గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్, బ్రహ్మానందం ఫొటో.. చరణ్ కొత్త లుక్ చూశారా?

కాగా రామ్ చరణ్ కంటే ముందు ఈ మార్క్‌ని అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అందుకున్నారు. అయితే ఆ మార్క్ ని అందుకోవడానికి బన్నీకి 1925 రోజులు, విజయ్ దేవరకొండకి 2050 రోజులు పట్టాయి. కాగా ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోల్లో అల్లు అర్జున్ 24.2M ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉంటే, నెక్స్ట్ ప్లేసులో విజయ్ దేవరకొండ 20.7M ఫాలోవర్స్ తో ఉన్నారు.

రామ్ చరణ్ ఫాలోవర్స్ కౌంట్ స్పీడ్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లో విజయ్, అల్లు అర్జున్ ని క్రాస్ చేసి నెంబర్ వన్ గా నిలుస్తారని తెలుస్తుంది. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరితో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవుతుందని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.