Ram Charan : మొన్న మెగాస్టార్.. నేడు మెగా పవర్ స్టార్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు..

సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే చిరంజీవి, నిఖిల్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. మరికొంతమంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Ram Charan : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. నేడు అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి సమావేశాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలుగా గెలిచినా వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇక తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాల ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే చిరంజీవి, నిఖిల్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. మరికొంతమంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Also Read : Mahesh Babu : రేవంత్ రెడ్డికి సూపర్ స్టార్ అభినందనలు.. స్పెషల్ ట్వీట్ తో..

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చరణ్ తన ట్విట్టర్ లో.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వంలో తెలంగాణలో పాజిటివ్ ఎనర్జి రావాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. దీంతో చరణ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారగా సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు థ్యాంక్స్ చెప్తూ రిప్లైలు ఇస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు