Peddi: ‘పెద్ది పహిల్వాన్’.. చరణ్ మాస్ ర్యాంపేజ్.. కుస్తీ వీరుడిగా లుక్ నెక్స్ట్ లెవల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'పెద్ది' చిత్ర బృందం అదిరిపోయే కానుకను అందించింది.

ram charan birthday special teaser from peddi

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ‘పెద్ది(Peddi)’ చిత్ర బృందం అదిరిపోయే కానుకను అందించింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా నుంచి సరికొత్త టీజర్‌ను మార్చి 27న విడుదల చేశారు. గతంలో విడుదలైన టీజర్‌లో రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కనిపించగా, తాజా వీడియోలో ఆయన పక్కా మాస్ లుక్‌లో కుస్తీ పోటీల వీరుడిగా దర్శనమిచ్చారు. భారీ దేహదారుఢ్యంతో, తీక్షణమైన చూపులతో చరణ్ కనిపిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ నటన, ఫిజిక్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.