Ram Charan : విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ క్యామియో ఉందా..? మహేష్ బాబు ఏం చెప్పాడు..?

లియోలో రామ్ చరణ్ క్యామియో ఉండబోతుందని గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. దీని గురించి మహేష్ బాబు ఏం చెప్పాడు..?

Ram Charan cameo in Leo Movie Mahesh Babu meme video viral

Leo Movie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా ‘లియో’. ఈ మూవీ పై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సూపర్ బజ్ ఉంది. లోకేష్ తెరకెక్కించిన గత చిత్రం ‘విక్రమ్’లో సూర్యతో ఒక మాస్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇప్పించి ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు లియోలో కూడా అలాంటి ఎంట్రీ ఉంటుందా? అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఈక్రమంలోనే లియోలో రామ్ చరణ్ క్యామియో ఉండబోతుందని గత కొన్ని రోజులుగా నెట్టింట తెగ చర్చ జరుగుతుంది.

ఇక ఇటీవల లియో ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి.. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో ఫిక్స్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఇవి చూసిన చరణ్ అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతూ.. సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఒక అభిమాని చేసిన ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమా క్లైమాక్స్ లోని ఒక సన్నివేశాన్ని షేర్ చేశాడు.

Also read : Akshay Kumar : అప్పుడు బుద్దిమంతుడు కబుర్లు చెప్పి.. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్న అక్షయ్..

ఆ సీన్ ఏంటంటే.. “నువ్వు చెప్పే ప్రతి కథ నేను వింటానురా. ఎందుకంటే ఆ ప్రతి కథలో మా అమ్మానాన్న ఉన్నారు” అని మహేష్ బాబు అంటాడు. దీనిని రామ్ చరణ్ క్యామియోకి సింక్ చేస్తూ షేర్ చేశాడు. ఇక ఇది చూసిన తోటి అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో ఈ మూవీ కొత్త షెడ్యూల్ జరుగుతుంది. మళ్ళీ కొన్ని రోజుల్లో వరుణ్ తేజ్ పెళ్లి కారణంగా రామ్ చరణ్ ఈ షూటింగ్ బ్రేక్ ఇవ్వనున్నాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.