Akshay Kumar : అప్పుడు బుద్దిమంతుడు కబుర్లు చెప్పి.. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్న అక్షయ్..
బాలీవడ్ హీరో అక్షయ్ కుమార్ ని నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు బుద్దిమంతుడు కబుర్లు చెప్పి..

Akshay Kumar facing trolling from social media for doing that ad
Akshay Kumar : బాలీవడ్ హీరో అక్షయ్ కుమార్.. ప్రస్తుతం సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్నాడు. అయినాసరి పట్టు వదలని విక్రమార్కుడిలా హిట్టు కోసం సినిమాలు చేసుకుంటూనే ముందుకు వెళ్తున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక విషయంలో అక్షయ్ ని నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. “అప్పుడు బుద్దిమంతుడు కబుర్లు చెప్పి.. ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అక్షయ్ చేసిన ఆ పని ఏంటి..? నెటిజెన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?
అక్షయ్ సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఈక్రమంలోనే ‘విమల్ ఏళైచి’ అనే పాన్ మసాలా యాడ్ కూడా చేశాడు. అయితే గతంలో ఈ యాడ్ విషయంలో అక్షయ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో అప్పుడు ఒక క్షమాపణ లెటర్ ని రిలీజ్ చేశాడు. “నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను కూడా. విమల్ ఎలైచి బ్రాండ్ నుంచి నేను వెనక్కి తగ్గుతున్నాను. ఇది మాత్రమే కాదు నా భవిష్యత్ యాడ్స్ చేయడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను” అంటూ లెటర్ లో పేర్కొన్నాడు.
Also read : Uday Kiran : అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సింది.. కానీ మహేష్ బాబు..
View this post on Instagram
గత ఏడాది ఈ లెటర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే యాడ్ ని చేయడంతో నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. మరి అక్షయ్ ఈ ట్రోలింగ్స్ పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక ఇదే యాడ్‌లో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ కూడా నటించారు. అక్షయ్ తో పాటు వీరిద్దర్నీ కూడా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. స్టార్ హీరోలు అయ్యుండి.. ఇలా పాన్ మసాలా యాడ్స్ చేసి ఫ్యాన్స్ ఎలాంటి మెసేజ్ లు ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.