బ్రాట్‌తో చెర్రీ చిల్ అవుట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెట్‌తో చిల్ అవుట్ అవుతున్న పిక్ వైరల్ అవుతోంది..

  • Publish Date - February 23, 2020 / 01:56 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెట్‌తో చిల్ అవుట్ అవుతున్న పిక్ వైరల్ అవుతోంది..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు పెంపుడు జంతువులంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆదివారం నాడు చెర్రీ తన పెట్ బ్రాట్‌తో చిల్ అవుట్ అవుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కాస్త తీరిక సమయం దొరకడంతో బ్రాట్‌తో సరాదాగా గడిపాడు. కొద్ది సంవత్సరాల క్రితం భార్య ఉపాసన జాక్ రస్సెల్ బ్రీడ్‌కి చెందిన బ్రాట్‌ను చెర్రీకి గిఫ్ట్‌గా ఇచ్చారు. మెగా కోడలు ఉపాసన ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

చరణ్ తెల్ల ధోతి, టీ షర్టులో ఆర్ఆర్ఆర్ లుక్‌లో బాగున్నాడు. మర్చి 27 చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘RRR’ మూవీ నుంచి తను పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు లుక్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.