Ram Charan dance with ganesh acharya master for old bollywood super hit song #MainKhiladiTuAnari
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ వారసత్వాన్ని డ్యాన్స్ లో కూడా పూర్తిగా తీసుకొని తన స్టెప్పులతో అభిమానులని మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కితున్న RC15 సినిమా షూట్ లో ఉన్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూట్ కి సంబంధించి ఓ సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ పాటకి బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. అయితే ఈ పాట షూట్ గ్యాప్ లో గణేష్ ఆచార్య మాస్టర్ తో కలిసి రామ్ చరణ్ ఓ పాత బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కి స్టెప్పులు వేశారు.
#MENTOO : Being a man is not easy.. అబ్బాయిల కష్టాలపై సినిమా.. #MENTOO టీజర్ రిలీజ్..
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన మైన్ ఖిలాడీ తు అనారి సినిమాలోని పాపులర్ సాంగ్ మైన్ ఖిలాడీ తు అనారికి చరణ్, గణేష్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేశారు. అదిరిపోయే స్టెప్పులతో రామ్ చరణ్, గణేష్ ఆచార్య మాస్టర్ ఈ పాటకి రీల్ లాగా చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషయల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ ఇలా స్టెప్స్ వేస్తూ రీల్ చేయడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
This is a MEGA treat ?
Mega Power Star @AlwaysRamCharan moves & grace are a treat to watch as he shakes a leg with Ace Choreographer Ganesh Acharya dancing to Blockbuster Gaana #MainKhiladiTuAnari ? pic.twitter.com/2UZEkjsqC2
— Vamsi Kaka (@vamsikaka) February 13, 2023