Ram Charan: చెర్రీ డిజిటల్ ఎంట్రీ.. హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ?
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయమని ఎంతో ఆశ పడ్డారు అభిమానులు. అందుకు తగ్గట్లే నార్త్ ఆడియన్స్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- Naresh Mannam
- Published On : March 31, 2022 / 12:52 PM IST
Ram Charan
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారడం ఖాయమని ఎంతో ఆశ పడ్డారు అభిమానులు. అందుకు తగ్గట్లే నార్త్ ఆడియన్స్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామరాజుగా చరణ్ నటనకు అక్కడి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో కలిసి వచ్చే స్టార్ డమ్ ను నిలబెట్టుకునేందుకు ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా అదే స్థాయి సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్.
Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!
ఇప్పటికే దక్షణాది మరో దిగ్గజం శంకర్ తో సినిమా మొదలు పెట్టిన రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో పాన్ ఇండియా సినిమాకు ఒకే చెప్పాడు. శంకర్ సినిమా సెట్స్ మీద ఉండగానే గౌతమ్ తో సినిమా ఒకే చేసిన చరణ్ త్వరలోనే తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్యతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఇప్పటికే భారీ లైనప్ సెట్ చేసుకున్న చరణ్.. డిజిటల్ ఎంట్రీకి కూడా ప్లాం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
Ram Charan: చరణ్‌కు బాలీవుడ్ కంపెనీల ఎర..?
హాలీవుడ్ లో రూపొందుతున్న ఒక పాపులర్ వెబ్ సిరీస్ ను ఒక బడా సంస్థవారు తెలుగులో రూపొందించనున్నారు. ఇందుకోసం ముందుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకోవాలని అనుకున్నారట. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ ను తీసుకోవాలనే ఉద్దేశంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా నచ్చిన చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే అందులో వాస్తవం ఎంతవరకూ ఉందనేది తెలియదు కానీ.. వెబ్ సిరీస్ ల హవా నడుస్తున్న ఇలాంటి తరుణంలో చరణ్ కూడా ఎంట్రీ ఇస్తే అది కెరీర్ కి మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఎంతో ఆశపడుతున్నారు.
