Ram Charan: చరణ్‌కు బాలీవుడ్ కంపెనీల ఎర..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను.....

Ram Charan: చరణ్‌కు బాలీవుడ్ కంపెనీల ఎర..?

Bollywood Offers For Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా, మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కలిసి నటించడంతో ‘ఆర్ఆర్ఆర్’కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్, సినిమాలో ఆయన పండించిన ఎమోషన్ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి.

RRR Malli : ఈ మల్లి ఎవరు.. ఇప్పుడెలా ఉందో తెలుసా..? ‘కొమ్మ ఉయ్యాల’ పాట ఎందుకంత హిట్..?

చరణ్ యాక్టింగ్ చూసి పలువురు క్రిటిక్స్ సైతం ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో చరణ్ యాక్టింగ్‌ను ట్రోల్ చేసిన బాలీవుడ్ విమర్శకులు, ఇప్పుడు చరణ్ యాక్టింగ్‌కు దాసోహం అంటున్నారు. ఇంతగా యాక్టింగ్‌లో మెచ్యూరిటీ చూపెట్టిన చరణ్‌పై ఇప్పుడు బాలీవుడ్ వర్గాల కన్ను పడింది. గతంలోనే చరణ్ ‘తుఫాన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా అక్కడ ఘోరంగా పరాజయం పాలైంది. కానీ ఆర్ఆర్ఆర్ దెబ్బకు మళ్లీ చరణ్‌తో సినిమాలు చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఓ బాలీవుడ్ బడా కంపెనీ చరణ్‌ను రెండు చిత్రాలు చేయాల్సిందిగా ఆఫర్ ఇచ్చిందట. అంతేగాక ఈ రెండు చిత్రాల్లో నటిస్తే, ఆయనకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా ఆ కంపెనీ రెడీ అంటోందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కానీ ఈ విషయంపై చరణ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Ram Charan: ఉక్రెయిన్‌లో తన బాడీగార్డ్‌ను ఆదుకున్న రామ్ చరణ్!

ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి తన సత్తా చాటిన రామ్ చరణ్‌కు ఇలా బాలీవుడ్ ఆఫర్లు వస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ ఇప్పటికే కీలక పాత్రలో నటించిన ఆచార్య.. మరో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం.. రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, చరణ్ ఇప్పుడే బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారా అనేది అనుమానంగా మారింది. మరి ఈ విషయంపై చరణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.