OPPO Enco Air 5s : మ్యూజిక్ లవర్స్‌కు పండుగే.. ANC పవర్‌తో ఒప్పో ఎన్కో ఎయిర్ 5S.. 48 గంటలు నాన్‌స్టాప్!
OPPO Enco Air 5s : ఒప్పో ఎన్కో ఎయిర్ 5s వచ్చేస్తోంది. 48 గంటల బ్యాటరీతో అడ్వాన్స్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తోంది. మే 25న లాంచ్ అయ్యే పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
OPPO Enco Air 5s
- ఒప్పో సెమీ-ఇన్ ఇయర్ డిజైన్ వస్తోంది
- కంపెనీ 3 కలర్ ఆప్షన్లలో లాంచ్
- లైట్ వెయిట్, కేవలం 3.9 గ్రాముల బరువు మాత్రమే
OPPO Enco Air 5s : ఒప్పో లవర్స్‌కు గుడ్ న్యూస్.. మే 25న ఒప్పో నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ కానున్నాయి. ఒప్పో ఎంకో ఎయిర్5, ఒప్పో ఎంకో ఎయిర్5 ప్రోలను లాంచ్ చేసింది. కంపెనీ ఇప్పుడు ఎంకో ఎయిర్5s పేరుతో కొత్త ఇయర్ బడ్స్ రిలీజ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇది మూడో వేరబుల్ ప్రొడక్టు అవుతుంది.
యూజర్లకు కంపర్ట్ అందించే ఇయర్‌బడ్స్‌ను అందించడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది. కొత్త ఒప్పో ఎంకో ఎయిర్5 చైనాలో లాంచ్ కానుంది. కంపెనీ (OPPO Enco Air 5s) ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒప్పో ఎంకో ఎయిర్5s అనేది కంపెనీ రాబోయే ఇయర్‌బడ్స్.. కేవలం 2 రోజుల్లో మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఒప్పో ఎంకో ఎయిర్5s మే 25వ తేదీన రిలీజ్ చేయనుంది. కంపెనీ వీబోలో పోస్ట్ ద్వారా ఈ ఇయర్ బడ్స్ వివరాలను టీజ్ చేసింది.
ఒప్పో ఎంకో ఎయిర్5s స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
సెమీ-ఇన్-ఇయర్ డిజైన్‌తో వస్తుంది. కేవలం 3.9 గ్రాముల బరువుతో చాలా లైట్ వెయిట్ ఉంటాయి. కంపెనీ మిడ్నైట్ బ్లాక్, స్టార్‌లైట్ పర్పుల్, మూన్లైట్ వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.
Read Also : iPhone 20 : వారెవ్వా.. ఆపిల్ ఐఫోన్ 20 రెండర్లు లీక్.. 200MP కెమెరా, బెజెల్ ఫ్రీ డిజైన్ చూస్తే షాక్ అవుతారు!
కాల్ నాయిస్ రిడక్షన్ అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు. ఏఐ వాయిస్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో స్పేషియల్ ఆడియో, అడాప్టివ్ సౌండ్ ట్యూనింగ్కు సపోర్టు ఇచ్చే 12mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. డ్యూయల్-డివైస్ కనెక్టివిటీని అందిస్తాయి. తద్వారా ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేయవచ్చు.
ఈ ఇయర్‌బడ్స్‌లో స్లైడింగ్ టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లు రెండింటికీ సపోర్ట్ చేస్తాయి. ఈ కంపెనీ ఇటీవల ఒప్పో ఎంకో ఎయిర్ 5ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 12mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. 10 బ్యాండ్ కస్టమ్ ఈక్యూ సెట్టింగ్‌లతో వస్తాయి.
AAC, SBC కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. 52dB వరకు ఉండే అద్భుతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా క్లియర్ వాయిస్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ అందించగలవని కంపెనీ పేర్కొంది.
ఎన్కో ఎయిర్ 5 కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 6.1కు సపోర్ట్ చేస్తుంది. 13 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి 54 గంటల వరకు ప్లేబ్యాక్ అందించగలవు. ఇందులో క్విక్ ఛార్జ్ ఫీచర్ కూడా ఉంది.
10 నిమిషాల ఛార్జ్‌తో 4 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ బరువు 4.3 గ్రాములు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ IP55 రేటింగ్ కూడా అందిస్తుంది.
