Ram Charan: ఉక్రెయిన్‌లో తన బాడీగార్డ్‌ను ఆదుకున్న రామ్ చరణ్!

యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆతృతగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. మరో వారం రోజులలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకి ప్రస్తుతం..

Ram Charan: ఉక్రెయిన్‌లో తన బాడీగార్డ్‌ను ఆదుకున్న రామ్ చరణ్!

Ram Charan

Ram Charan: యావత్ ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులంతా ఆతృతగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. మరో వారం రోజులలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ యూనిట్ భారీ ప్రమోషన్ల కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ షూటింగ్ కొంత భాగం యుక్రెయిన్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో సినిమా హీరోలలో ఒకడైన రామ్ చరణ్ కి రస్టీ అనే యుక్రెయిన్ వ్యక్తి బాడీగార్డ్ గా పనిచేశాడు. కాగా.. ఇప్పుడు రస్టీ దారుణమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

RRR: చరణ్ సైలెంట్.. టైమింగ్‌తో అటెన్షన్ కొట్టేస్తున్న తారక్!

ప్రస్తుతం యుక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల గురించి ప్రపంచమంతా తెలిసిందే. యుక్రెయిన్ పై రష్యా యుద్ధ కారణంగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలకు కూడా యుక్రెయిన్ ప్రభుత్వం ఆయుధాలను ఇచ్చి పోరాడాలని పిలుపునివ్వడంతో ఎంతో మంది ప్రజలు దేశం కోసం స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కి బాడీ గార్డ్ గా పనిచేసిన రస్టీతో పాటు ఆయన కుటుంబం కూడా ఆయుధాలు చేతపట్టి యుద్ధంలో పాల్గొంటుంది.

RRR: దుబాయ్-2020 ఎక్స్‌పోలో ఆర్ఆర్ఆర్ వేడుక.. సర్వం సిద్ధం!

అయితే.. దేశంలో యుద్ధం పరిస్థితుల కారణంగా రస్టీ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ తో ఉన్న చొరవ కారణంగా రస్టీ సహాయాన్ని కోరాడు. దీంతో రామ్ చరణ్ అతనికి కాల్ చేసి క్షేమ సమాచారం తెలుసుకొని అతని ఆర్థిక అవసరాలతో పాటు అతనికి అన్ని విధాలా సహాయం చేశారు. చెర్రీ పంపిన డబ్బులతో రస్టీ నిత్యావసర వస్తువులు, మెడిసిన్‌ కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ రస్టీ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.