RRR: దుబాయ్-2020 ఎక్స్‌పోలో ఆర్ఆర్ఆర్ వేడుక.. సర్వం సిద్ధం!

భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్ప్పుడు చూద్దమా అని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరిలో వాయిదా పడడంతో..

RRR: దుబాయ్-2020 ఎక్స్‌పోలో ఆర్ఆర్ఆర్ వేడుక.. సర్వం సిద్ధం!

RRR

RRR: భారీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్ప్పుడు చూద్దమా అని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానుల నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరిలో వాయిదా పడడంతో నిరుత్సాహపడిపోయిన అభిమానులు ఇప్పుడు మార్చి 25న సినిమా విడుదలతో మళ్ళీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళ ఆసక్తికి తగ్గట్లే మరోసారి ప్రమోషన్లతో రచ్చ చేసేందుకు సిద్దమవుతుంది ఆర్ఆర్ఆర్ యూనిట్. మార్చి 14 నుండి మొదలైన ప్రమోషన్ల రచ్చ ఈ నెల 24 వరకు కొనసాగనుంది.

RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

ఇప్పటికే పలు చానెళ్లు, ఈవెంట్లతో చుట్టేస్తున్న ఆర్ఆర్ఆర్ టీం మార్చి 18న ఏకంగా దుబాయ్ లో ఈవెంట్ నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై ఆసక్తిని పెంచేందుకు సిద్ధమైంది. మార్చి 18న ఆర్ఆర్ఆర్ మూవీ స్పెషల్ ఈవెంట్ ని దుబాయ్ ఎక్స్‌పో 2020లో నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకను ఘనంగా నిర్వహించబోతుండగా ఈ కార్యక్రమానికి ఇప్పటికే సర్వం సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీం మొత్తం హాజరవుతుంది.

RRR: జక్కన్న స్పెషల్ ప్రమోషన్స్.. దుబాయ్ ఈవెంట్‌కు ఒలివియా మోరిస్!

ఈ సినిమాలో నటించిన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ఇప్పటి వరకు ఎలాంటి ఈవెంట్లకు హాజరుకాకపోగా దుబాయ్ ఈవెంట్ కు ఒలీవియా హాజరు కానుందని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం కన్ఫర్మ్ చేసింది. కాగా.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీస్ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక గెస్టులుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ దుబాయ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది.. ఎవరెవరు హాజరు కానున్నారని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరికాసేపట్లోనే ఈ ఈవెంట్ మొదలు కానుంది.