RRR: జక్కన్న స్పెషల్ ప్రమోషన్స్.. దుబాయ్ ఈవెంట్‌కు ఒలివియా మోరిస్!

యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ ప్రెస్టీజియస్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే..

RRR: జక్కన్న స్పెషల్ ప్రమోషన్స్.. దుబాయ్ ఈవెంట్‌కు ఒలివియా మోరిస్!

Rrr

RRR: యావత్ దేశంలోని సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ ప్రెస్టీజియస్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవు. దీంతో యూనిట్ మరోసారి ప్రేక్షుకులలోకి వెళ్లేలా భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ వరుసబెట్టి పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలతో పాటు మరికొన్ని స్పెషల్ షోస్, ఇంటర్వ్యూస్ చేసి వదులుతుంది.

RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులు వారే..?

తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ ఇంటర్వ్యూలో అనిల్ ఎన్టీఆర్ హీరోయిన్ గురించి అడిగాడు. ఆర్ఆర్ఆర్ లో తారక్ సరసన అసలు హీరోయిన్ ఉందా అంటూ అనిల్ రావిపూడి ప్రశ్నించాడు. దీంతో తారక్.. ‘ఏమో ఈ సినిమాలో తనకు హీరోయిన్ ఉందో లేదో తెలియదని.. తనకు కూడా ఈ విషయం అర్థం కాలేదని అన్నాడు. ‘‘ఉండీ ఉండనట్టుగా.. నాదా కాదా అన్నట్టుగా.. అది ఉందా లేదా అన్నట్టుగా.. ఆయన ఎవరినైనా పెట్టారా లేదా అన్నట్టుగా.. విచిత్రంగా ఉంది’ అంటూ తారక్ సరదా రిప్లై ఇచ్చాడు.

RRR : అమెరికాలో భారీగా ‘ఆర్ఆర్ఆర్’.. 1150 పైగా థియేటర్స్‌లో..

కాగా.. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. అసలు ఇంతకీ ఎన్టీఆర్ జోడి హీరోయిన్ ఒలివియా మోరిస్ ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తుందా రాదా అంటూ అభిమానులు మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ ఫ్యాన్ ఒలీవియా ఎప్పుడొస్తుందని ఆర్ఆర్ఆర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేసి ప్రశ్నించగా.. దుబాయ్ ఈవెంట్ కు ఒలివియా రాబోతుందని ఆర్ఆర్ఆర్ టీం బదులిచ్చింది. దీంతో దుబాయ్ ఈవెంట్ ఉంటుందని క్లారిటీ రావడంతో పాటు దానికి ఒలివియా అటెంట్ అవుతూ స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందన్నది కూడా కన్ఫర్మ్ అయింది.