RRR: చరణ్ సైలెంట్.. టైమింగ్‌తో అటెన్షన్ కొట్టేస్తున్న తారక్!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం ఇండియన్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలోని..

RRR: చరణ్ సైలెంట్.. టైమింగ్‌తో అటెన్షన్ కొట్టేస్తున్న తారక్!

Rrr

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం ఇండియన్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలోని సినిమా లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ కాగా ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రీబుకింగ్ సేల్స్‌లో అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ టీం ఇండియాలో రాష్ట్రాలే కాదు ప్రపంచాన్ని చుట్టేస్తూ భారీ ప్రమోషన్లు చేస్తున్నారు.

RRR: దుబాయ్-2020 ఎక్స్‌పోలో ఆర్ఆర్ఆర్ వేడుక.. సర్వం సిద్ధం!

గతంలో జనవరిలో విడుదల సమయంలో ఎక్కడ ఆపారో అక్కడ నుండి మొదలు పెట్టిన ఈ ప్రమోషన్లను మరోసారి అప్పుడు మొదలు పెట్టిన రాష్ట్రాలను మళ్ళీ చుట్టేసే ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లను నిర్వహించగా అందులో హీరోలిద్దరితో పాటు దర్శకుడు రాజమౌళి కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే టీంలో ఎంతమంది ఉన్నా.. హీరోలిద్దరూ ఉన్నా తారక్ మాత్రం ఎక్కడకి వెళ్తే అక్కడ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు.

RRR: ‘మహాప్రభో.. నన్ను వదిలేయండి’.. జక్కన్నకు దండం పెట్టిన తారక్!

గతంలో జనవరిలో ఇంటర్వ్యూలలో కూడా ఎన్టీఆర్ ఇలాగే అందరి చూపు తనవైపుకు తిప్పుకున్నాడు. ఏ రాష్ట్రానికి వెళ్తే అక్కడ స్థానిక భాషలో తడుముకోకుండా మాట్లాడుతూ శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే.. ఏ ఈవెంట్ కి వెళ్లినా అల్లరి చేస్తూ.. దర్శకుడు రాజమౌళిని టీజ్ చేస్తూ.. తనకి ఎలాంటి ప్రశ్న ఎదురైనా స్పాంటినిటీ కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు. బాషల మీద పట్టు.. స్టైల్, కాన్ఫిడెంట్ లో రామ్ చరణ్ ఏ మాత్రం ఎన్టీఆర్ కంటే తక్కువ కాదు. కానీ.. చరణ్ మనస్తత్వం వేరు.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి.. అంతే సమాధానం చెప్తున్నాడు.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ఏకంగా మిలియన్ మంది!

కానీ.. ఎన్టీఆర్ అలా కాదు.. తనకి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎదురైనా అనుభవాలను.. సినిమా ఎలా ఉండబోతుందో.. సినిమా పట్ల హీరోలుగా వాళ్లకున్న కాన్ఫిడెంట్ లెవెల్ ఎలాంటిదో చెప్తూనే.. దర్శకుడు రాజమౌళి వాళ్ళని ఎలా హింసలు పెట్టాడో.. రాజమౌళి ఫ్యామిలీ ఎలా ఉంటారో.. అవసరమైతే అందరినీ ఇమిటేట్ చేస్తూ ఫన్ జెనరేట్ చేస్తూ నవ్విస్తున్నాడు. అదే సమయంలో మీడియా ఇంటర్వ్యూలలో హుందాగా ప్రవర్తిస్తూ మెప్పిస్తున్నాడు. దీంతో ఇద్దరు హీరోలు ఎక్కడికి వెళ్లినా తారక్ హైలెట్ అవుతున్నాడు. కానీ.. ఫైనల్ గా ఇద్దరి హీరోల బాండింగ్ మాత్రం స్పెషల్ గా నిలుస్తుంది.