Ram Charan emotional video post about Klin Kaara on Upasana Birthday
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన (Upasana) తమ పెళ్లయిన 10 ఏళ్ళకి తమ మొదటి బేబీకి ఆహ్వానం పలికారు. మెగా ప్రిన్సెస్ క్లీంకార రాకతో మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందం నెలకుంది. జూన్ 20న క్లీంకార జన్మించింది. ఇక కరెక్ట్ గా నెలకు.. అంటే జులై 20న ఉపాసన పుట్టినరోజు కావడం విశేషం. దీంతో రామ్ చరణ్ ఉపాసనకు బర్త్ డే విషెస్ చెబుతూ, అలాగే తన ముద్దుల కూతురు క్లీంకారకి కూడా ఒక నెల పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు.
Kanguva : సూర్య కంగువ గ్లింప్స్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. ప్రీ లుక్ అదిరిపోయింది..
ఆ వీడియోలో తమ పెళ్లినాటి నుంచి క్లీంకార నామకరణం వరకు విజువల్స్ చూడవచ్చు. ఇక క్లీంకార పుట్టే సంయమలో తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఎంతో టెన్షన్ పడినట్లు, అంతా సజావుగా జరగాలని దేవుడిని ప్రార్దించినట్లు, వారందరి ప్రార్థనల ప్రకారమే క్లీంకార ఈ లోకంలోకి అడుగు పెట్టిందని చరణ్ చెప్పుకొచ్చాడు. క్లీంకార పుట్టిన సందర్భం, తను పుట్టడానికి ముందు 9 నెలల సమయం.. ఈ మొత్తం ప్రాసెస్ లో ప్రతి క్షణం మనసుకి ఎంతో ఆహ్లదంగా, సంతోషంగా అనిపించినట్లు రామ్ చరణ్ పేర్కొన్నాడు.
ఇక ఇదే వీడియోలో ఉపాసన కూడా మాట్లాడుతూ.. “ద్రావిడ సంస్కృతిలో తమ పాప భాగం కావాలని తనకి క్లీంకార అనే పేరు పెట్టాం. కాబట్టి ఆ పేరుకి ముందు ముందు వెనుక ఎటువంటి ట్యాగ్స్ పెట్టొద్దు. అలాంటి ట్యాగ్స్ ని వారే స్వయంగా సంపాదించుకోవాలి అనేది నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైంది” అంటూ పేర్కొన్నారు.
ఈ వీడియోలో క్లీంకార రాక తరువాత జరిగిన సెలబ్రేషన్స్ మొత్తం చూపిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే హాస్పిటల్ రామ్ చరణ్ మొదటిసారి పాపని చేతులోకి తీసుకోని అందరి ముందుకు తీసుకు రావడం, నామకరణం రోజు బంధుమిత్రులు మధ్య హంగామా, ద్రావిడు సంస్కృతిలో భాగంగా చెంచు జాతి వారు నిర్వహించే పూజలు, నృత్యాలు కనిపిస్తున్నాయి.