Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి నాలుగో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.

Ram Charan Game Changer Movie Fourth Song Promo Released

Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక పాటలు శంకర్ డైరెక్షన్ అంటే ఉండే గ్రాండియర్ తో అద్భుతంగా ఉండటంతో ఇప్పటి వరకులు వచ్చిన మూడు పాటలు పెద్ద హిట్ అయ్యాయి. తమన్ ఇచ్చిన మ్యూజిక్, శంకర్ మార్క్ విజువల్స్ తో పాటలు అదిరిపోయాయి.

తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి నాలుగో సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..

https://www.youtube.com/watch?v=2skoNGm3x08

ఇక ఈ ఫుల్ సాంగ్ డిసెంబర్ 22న ఉదయం 8.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ చాలా స్టైలిష్ గా ఉంది. ఇక ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్, రోషిని, పృథ్వీ శృతి రంజని పాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవ్వగా ఫ్యాన్స్ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.