Ram Charan Game Changer Movie Release Date Announced with New Poster
Game changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇవాళ దసరా రోజు ఉదయమే ఈ సినిమా క్రిస్మస్ కి రావట్లేదు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాము అని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి.
నేడు దసరా రోజు గేమ్ ఛేంజర్ ఉదయం సినిమా సంక్రాతికి తీసుకొస్తామని చెప్పగా తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు మూవీ యూనిట్. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రాబోతుండటంతో చిరంజీవి విశ్వంభర వాయిదా పడనుంది.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, సునీల్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
దసరా శుభాకాంక్షలతో!
தசரா நல்வாழ்த்துக்களுடன்!
दशहरा की शुभकामनाएं!#GameChanger Worldwide In Cinemas On January 10th ❤️🔥✊🏼 pic.twitter.com/gdVnEkytLv— Game Changer (@GameChangerOffl) October 12, 2024