Tejaswini Nandamuri : బాలయ్య రెండో కూతురు.. మొదటిసారి మీడియా ముందుకు.. ఎంత బాగా మాట్లాడిందో..
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.

Balakrishna Second Daughter Tejaswini Nandamuri First Speech before Media goes Viral
Tejaswini Nandamuri : బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాతగా కూడా మారుతున్నారు తేజస్విని. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినిమాని కూడా తేజస్విని లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్‌స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇవాళ మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది.
నేడు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో తేజస్విని కూడా పాల్గొంది. మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడింది.
నందమూరి తేజస్విని మాట్లాడుతూ.. నాకు చాలా స్పెషల్ ఈ రోజు. నేను మొదటిసారి మీ అందరి ముందు కూర్చున్నాను. అరవింద్ అంకుల్ కి ఈ ఆలోచన వచ్చి చెప్పినపుడు అందరూ ఆలోచించారు ఈ షో చేద్దామా లేదా అని. కానీ ఒక పర్సన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇది చేయాల్సిందే అని చెప్పారు నాన్న గారు. నాన్న ధైర్యం చేసి ఇది చేసారు. ఆ ధైర్యమే ఇవాళ అన్‌స్టాపబుల్ ని ఈ రేంజ్ కి తీసుకొచ్చింది. IMDB రేటింగ్స్ లో అన్‌స్టాపబుల్ షో వరల్డ్ లో 18వ ర్యాంక్ వచ్చింది. ఇండియాలో మోస్ట్ పాపులర్ షో అయింది. ఈ షోలో యూనిక్ పాయింట్ ఏంటి అంటే నాన్నలో ఎవరూ చూడని సైడ్ ఈ షోలో అందరూ చూశారు. నాకు తెలిసి అన్‌స్టాపబుల్ అంటే ఛాలెంజెస్ వచ్చినప్పుడు ధైర్యంగా వారిని తీసుకోవడం, పక్కన ఎవరు ఉంటే వాళ్ళ కోసం నిలబడటం, సమాజం కోసం నిలబడటం.. ఇవన్నీ నాన్న గారిలో ఉన్నాయి. ఆయన ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ప్రజల కోసం నిలబడే వ్యక్తి. హిందూపూర్ లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన హిందూపూర్ గురించి ఎప్పుడూ మాట్లాడతారు. నాన్న నడిపే క్యాన్సర్ హాస్పిటల్ లో ఉండే పేషంట్స్ అది దేవాలయం అంటారు. నాన్నకు హ్యాట్సాఫ్. ఇప్పటికే అన్‌స్టాపబుల్ మూడు సీజన్స్ అయ్యాయి. నాలుగో సీజన్ మరింత గొప్పగా ఉంది. ఎవరూ ఊహించారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని తెలిపింది.
https://www.youtube.com/watch?v=y_rotV4CR2M
బాలయ్య రెండో కూతురు ఇలా మొదటిసారి మీడియా ముందుకు వచ్చి అద్భుతంగా మాట్లాడటంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తండ్రితో కలిసి తేజస్విని దిగిన ఫొటోలు, ఆమె మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారాయి. బాలయ్య కూడా ఈ ఈవెంట్లో అన్‌స్టాపబుల్ షో గురించి మాట్లాడారు. నాలుగో సీజన్ అద్భుతంగా ఉండబోతుందని, ఈసారి మరింత ఘాటు ప్రశ్నలు అడుగుతున్నాను అని తెలిపారు.