Unstoppable Season 4 : అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో చూశారా? ఇది బాలయ్య పండుగ.. యానిమేషన్‌తో సూపర్ హీరో బాలయ్య..
తాజాగా సీజన్ 4 కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రోమో రిలీజ్ చేసారు.

Aha Balakrishna Unstoppable with NBK Season 4 Promo Released
Unstoppable Season 4 : తెలుగు ఓటీటీ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మూడు మంచి విజయం సాధించగా ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతుంది. తాజాగా సీజన్ 4 కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ప్రోమో రిలీజ్ చేసారు.
ఈ ప్రోమో యానిమేషన్ తో డిజైన్ చేసారు. బాలకృష్ణ సూపర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రజల బాధల్ని తీర్చినట్టు, ప్రజలు అంతా పండగ చేసుకున్నట్టు, ఇది బాలయ్య పండగ అని ప్రోమో చూపించారు. మీరు కూడా ఈ యానిమేటెడ్ ప్రోమో చూసేయండి..
ఈ ప్రెస్ మీట్ కి బాలకృష్ణ తో పాటు అల్లు అరవింద్, బాలకృష్ణ కూతురు తేజస్విని, అనిల్ రావిపూడి, యానిమేషన్ చేసిన సంస్థ హెడ్ రాజీవ్, ఆహా టీమ్ అంతా పాల్గొన్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్ 4 కొన్ని ఎపిసోడ్స్ షూట్ కూడా అయిపోయిందని తెలిపారు. గత మూడు సీజన్లకు మించి ఈ సీజన్ ఉంటుందని చెప్పారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అని ప్రకటించారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సీజన్ 4 కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది హీరోలు, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు, రాజకీయ నాయకులను తీసుకొచ్చారు. మరి ఈ సీజన్ లో ఎవర్ని తీసుకొస్తారో చూడాలి.
పండుగ సమయం వచ్చేసింది!🥳
The Massiest superhero is here.. 💥⚡
Jai Balayya.. 🙋🏻♀️🙋🏻♂️Watch #UnstoppableS4 trailer▶️https://t.co/14OCztzA78#UnstoppableWithNBK #UnstoppableS4 #AhaOriginalSeries #NandamuriBalakrishna #JaiBalayya #NBK pic.twitter.com/STGikLw2I3
— ahavideoin (@ahavideoIN) October 12, 2024