Game Changer : ‘జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ..’ గేమ్ ఛేంజర్ నుంచి సాంగ్ లీక్..
''జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ..'' అంటూ సాగే ఫుల్ సాంగ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అని సోషల్ మీడియాలో లీక్ అయింది.
- Saketh U
- Updated on- September 16, 2023 / 05:35 PM IST
Ram Charan Game Changer Movie Song Leaked and Viral in Social Media listen Song here
Game Changer Movie Song : డైరెక్టర్ శంకర్ (Shankar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలయికలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. సినిమా మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇప్పటికి సరైన అప్డేట్స్ లేవు. ఇటీవల చరణ్ కి పాప పుట్టడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇచ్చాడు. అటు శంకర్ కూడా ఇండియన్ 2 సినిమాతో బిజీ అయ్యాడు. అభిమానులు మాత్రం గేమ్ చేంజెర్ అప్డేట్స్ కావాలని సోషల్ మీడియాలో హంగామా చేస్తూనే ఉన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే చాలా లీక్స్ వచ్చాయి. చరణ్ సినిమాల నుంచి ఇన్ని లీక్స్ రావడం ఇదే మొదటి సారి కావొచ్చు. వైజాగ్ లో డ్యాన్స్ షూటింగ్, కర్నూల్ లో షూటింగ్, రాజమండ్రిలో షూటింగ్.. ఇలా అనేక ప్రదేశాల్లో జరిగిన షూటింగ్స్ నుంచి పిక్స్, వీడియోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఏకంగా సాంగ్ లీక్ అయింది.
”జరగండి.. జరగండి.. మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ..” అంటూ సాగే ఫుల్ సాంగ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అని సోషల్ మీడియాలో లీక్ అయింది. మొదట ఇదేం సాంగ్ అని తిట్టుకున్నా ఇప్పుడేమో లిరిక్స్ బాగోలేకపోయినా మ్యూజిక్ బాగానే ఉంది అని అనుకుంటున్నారు అభిమానులు. దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ బాగా వైరల్ గా మారింది. ఇక ఈ పాటకి రామ్ చరణ్ పాత సినిమాల వీడియోలు జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఇదేం సాంగ్, శంకర్ సినిమాలో సాంగ్స్ ఇలా ఉండవు అని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఈ సాంగ్ గేమ్ ఛేంజర్ సినిమాలోదేనా కాదా అని మరికొంతమంది ఆలోచిస్తున్నారు. ఇక అభిమానులు చరణ్ ని త్వరగా షూట్ పూర్తి చేసి సినిమా అప్డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read : SIIMA Awards 2023 : సైమా అవార్డ్స్ ఈవెంట్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..
ఇక గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి, SJ సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, అనన్య, విశ్వంత్.. లాంటి స్టార్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాలో చరణ్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టు, ఇది పొలిటికల్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది.
