ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు వెల్లాలనుకోవడం సహజమే. ఇలాంటి ఆలోచనే మన రామ్ చరణ్‌కి కూడా వచ్చింది. చెర్రీ తాను చిన్నతనంలో తమిళనాడులో చదివిన లారెన్స్ స్కూల్‌ను నిన్న (మే 6, 2019)న సందర్శించారు. ఈ స్కూలు ఊటీకి 5 కిలోమీటర్ల దూరంలోని లవ్ డేల్ గ్రామంలో ఉంది. చరణ్, ఉపాసన ఇద్దరు కలిసి ఈ పాఠశాలను సందర్శించారు.
ఆ రోజుల్లో చెర్రీ చేసిన తుంటరి పనులు, అల్లరి వేషాలు గుర్తు తెచ్చుకుంటు చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యాడు. స్నేహితులతో గడిపిన క్షణాలను, చిన్నప్పుడు స్కూల్లో జరిగిన సంఘటనలను, సరదాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు. స్కూల్ క్యాంటీన్, హాస్టల్, బెడ్ రూమ్, ఇలా అన్నింటిని సందర్శించాక స్కూల్ పిల్లలతో కలిసి ఓ ఫోటో దిగాడు చెర్రీ.
అంతేకాదు ఈ క్రమంలో చెర్రీ పిల్లలతో కలిసి దిగిన సెల్ఫీలను, లారెన్స్ స్కూల్‌ని సందర్శించినప్పుడు తీసిన ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ జ్ఞాపకాలు ఎప్పటికి ఉంటాయి. అవి స్కూల్ మిస్ అయిన ఫీలింగ్ కలిగిస్తాయి. చరణ్‌లోను తన స్కూల్ జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. అవి తనలోని చిన్న పిల్లాడిని బయటకి తీసుకొచ్చాయి అని కామెంట్ పెట్టింది ఉపాసన.