Ram Charan – Aravind : నాన్న, బాబాయ్ లతో వెళ్ళను.. ఆ విషయంలో అరవింద్ మామ బెస్ట్.. చరణ్ ఆసక్తికర కామెంట్స్..

బాలయ్య చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించి..

  • Updated on- January 5, 2025 / 11:38 AM IST

Ram Charan Interesting Comments on Allu Aravind in Balakrishna Unstoppable Show

Ram Charan – Aravind : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ వచ్చిన ఎపిసోడ్ నుంచి తాజాగా ప్రోమో రిలీజ్ చేసారు. వరుస ఎపిసోడ్స్ తో ఆహా అన్‌స్టాపబుల్ దూసుకుపోతుంది. రామ్ చరణ్ ఎపిసోడ్ కి చరణ్ తో పాటు శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చి సందడి చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Also Read : Ram Charan : కూతురు గురించి మాట్లాడుతూ బాలయ్య షోలో ఏడ్చేసిన రామ్ చరణ్.. క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటే..

ఈ ప్రోమోలో బాలయ్య చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటో చూపించి.. వీళ్ళ ముగ్గురిలో పార్టీకి వెళ్లాలంటే ఎవరితో వెళ్తావు అని అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. ముగ్గురితో వెళ్ళను. మా మామతో వెళ్తాను. మామ అరవింద్ గారు పార్టీకి బెస్ట్ అని అన్నారు. దీంతో చరణ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పవన్ ఎలాగో పార్టీలకు దూరంగా ఉంటారు. నాగబాబు, చిరంజీవి కూడా అంత పార్టీ మూడ్ పర్సన్స్ కాదని ఇండైరెక్ట్ గా చరణ్ చెప్పేసాడు.

ఇక ఈ ప్రోమోలో.. చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియో చూపించారు. కూతురు క్లిన్ కారా గురించి చరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. శర్వానంద్ చరణ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాడు. బాలయ్య చరణ్ ఫోన్ నుంచి ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడారు. చివర్లో చరణ్, బాలయ్య కలిసి గేమ్ ఛేంజర్ పాటకు డ్యాన్స్ వేశారు. ప్రోమో అంతా సరదాగా సాగింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read : Balakrishna – Ram Charan : బాలయ్య, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పండగ ఎపిసోడ్ ప్రోమో అదిరిందిగా..

బాలయ్య – రామ్ చరణ్ ఎపిసోడ్ జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నిన్న రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చి సినిమాపై మరింత హైప్ పెంచారు.