Ram Charan : కూతురు గురించి మాట్లాడుతూ బాలయ్య షోలో ఏడ్చేసిన రామ్ చరణ్.. క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటే..

ప్రోమోలో చరణ్ తన కూతురు గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది చూపించారు.

Ram Charan : కూతురు గురించి మాట్లాడుతూ బాలయ్య షోలో ఏడ్చేసిన రామ్ చరణ్.. క్లిన్ కారా ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటే..

Ram Charan got Emotional in Balakrishna Unstoppable Show While Talking About Klin Kaara

Updated On : January 5, 2025 / 10:41 AM IST

Ram Charan – Klin Kaara : తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నుంచి మరో కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. సీజన్ 4లో తొమ్మిదవ ఎపిసోడ్ గా రానుంది. ప్రస్తుతం ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

Also Read : Balakrishna – Ram Charan : బాలయ్య, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పండగ ఎపిసోడ్ ప్రోమో అదిరిందిగా..

ప్రోమోలో చరణ్ తన కూతురు గురించి మాట్లాడి ఎమోషనల్ అయింది చూపించారు. బాలయ్య మాట్లాడుతూ 2023 లో మీ నాన్నకు ఒక కొడుకుగా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే అని అన్నారు. చరణ్ మాట్లాడుతూ.. బక్కగా ఉంటుంది. పొద్దున్నే రోజు రెండు గంటలు తనతోనే గడుపుతాను. నేను తినిపిస్తే తప్ప తినదు అంటూ తన గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

ఇప్పటిదాకా క్లిన్ కారా తో చరణ్, ఉపాసన ఫోటోలు బయటకి వచ్చినా ఫేస్ మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. దీంతో బాలయ్య ఇంతకీ క్లిన్ కారాని ఎప్పుడు చూపిస్తున్నావు అని అడగ్గా చరణ్.. తను నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడు అందరికి క్లిన్ కారాని చూపిస్తాను అని తెలిపారు. క్లిన్ కారా ఫేస్ చూపించమని మెగా ఫ్యాన్స్ ఎప్పట్నించి రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడు చూపిస్తారో ఈ షో ద్వారా చరణ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో క్లిన్ కారా చరణ్ ని త్వరగా నాన్న అని పిలవాలి అని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మీరు కూడా ప్రోమో చూసేయండి..

ఇక చరణ్ – ఉపాసనలకు 2023 జూన్ 20న క్లిన్ కారా పుట్టింది. గత సంవత్సరం సింపుల్ గా ఫస్ట్ బర్త్ డే కూడా చేసారు. ఎపిసోడ్ లో క్లిన్ కారా గురించి ఇంకెంత మాట్లాడాడో చరణ్ అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తో పాటు శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చారు. చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు ఇక్కడ..