Balakrishna – Ram Charan : బాలయ్య, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పండగ ఎపిసోడ్ ప్రోమో అదిరిందిగా..

తాజాగా రామ్ చరణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు.

Balakrishna – Ram Charan : బాలయ్య, రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.. పండగ ఎపిసోడ్ ప్రోమో అదిరిందిగా..

Balakrishna Ram Charan Unstoppable Episode Promo Released

Updated On : January 5, 2025 / 11:11 AM IST

Balakrishna – Ram Charan : ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 సూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్స్ రాగా తాజాగా తొమ్మిదవ ఎపిసోడ్ ప్రొమో రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ కి రామ్ చరణ్ వచ్చి సందడి చేసారు. రామ్ చరణ్ తో పాటు శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చి అలరించారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ ఈ షోకి వచ్చారు.

Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు ఇక్కడ..

మీరు కూడా బాలయ్య – రామ చరణ్ అన్‌స్టాపబుల్ ప్రోమో చూసేయండి..

 

ఈ ఎపిసోడ్ అంత అఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సరదా సరదాగా సాగింది. ఈ ప్రోమోలో.. చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియో చూపించారు. కూతురు క్లిన్ కారా గురించి మాట్లాడాడు చరణ్. శర్వానంద్ కూడా వచ్చి చరణ్ తో ఫ్రెండ్షిప్ గురించి పంచుకున్నాడు. ఉపాసన గురించి మాట్లాడాడు. ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడారు. దిల్ రాజు కూడా వచ్చి పార్టీ చేసుకుందాం అన్నారు. చరణ్, బాలయ్య కలిసి గేమ్ ఛేంజర్ పాటకు డ్యాన్స్ వేశారు.

Also Read : Pawan Kalyan : రామ్ చరణ్ పేరు వెనక కథ చెప్పిన పవన్.. సంవత్సరంలో 100 రోజులు మాలలోనే.. చెప్పులు లేకుండా..

దీంతో మెగా నందమూరి ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరగ్గా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావడంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది.