Pawan Kalyan : రామ్ చరణ్ పేరు వెనక కథ చెప్పిన పవన్.. సంవత్సరంలో 100 రోజులు మాలలోనే.. చెప్పులు లేకుండా..
బాబాయ్ అబ్బాయి బాండింగ్ చూసి, చరణ్ గురించి పవన్ గొప్పగా మాట్లాడిన మాటలు విని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan tells about Back Story of Ram Charan Name and his Character
Pawan Kalyan : నేడు రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అవచ్చారు. అబ్బాయి సినిమాకు బాబాయ్ గెస్ట్ గా రావడంతో మెగా ఫ్యాన్స్ తో ఈవెంట్ ప్రాంగణం హోరెత్తింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ అనేక అంశాల గురించి మాట్లాడారు. టికెట్ రేట్ల పెంపు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, చిరంజీవి గురించి, డైరెక్టర్ శంకర్ గురించి.. ఇలా అనేక అంశాలు మాట్లాడారు.
Also Read : Pawan Kalyan : ఏపీలో ఫిలిం స్కూల్స్ పెట్టండి.. స్టూడియోలు కట్టండి.. ఏపీని చిన్నచూపు చూడొద్దు..
ఈ క్రమంలో రామ చరణ్ గురించి గొప్పగా పొగిడారు. చరణ్ కి ఆ పేరు ఎలా పెట్టారు. చరణ్ చిన్నప్పటి నుంచే ఎలా కష్టపడ్డాడు. చరణ్ గొప్పతనం గురించి, చరణ్ భక్తి గురించి మాట్లాడారు.
చరణ్ పేరు వెనక కథ గురించి చెప్తూ.. మేం ఆంజనేయ స్వామి భక్తులం. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు చరణ్ పుట్టాడు. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు ఆంజనేయుడు. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టే ఉంటాడు అని తెలిపారు.
అలాగే రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ.. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. చిన్నప్పుడు చరణ్ ని బాగా ఏడిపించేవాడిని. ఏడేళ్ల వయసులోనే హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. చరణ్ ని నేనే దింపేవాడిని హార్స్ రైడింగ్ దగ్గర. చరణ్ ఇంగ్లాండ్ కి వెళ్లి డ్యాన్స్ నేర్చుకున్నాడు. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేసాడు. అందరు హీరోలకు మంచి స్నేహితుడు చరణ్. సంవత్సరంలో 100 రోజులు అయ్యప్పస్వామి మాలలోనో, ఆంజనేయ స్వామి మాలలోనో ఉంటాడు. ఎందుకు అని అడిగితే బాధ్యత ఉండటానికి, నియంత్రణ ఉండటానికి అని చెప్పేవాడు. చెప్పులు లేకుండానే నడుస్తాడు. హాలీవుడ్ కి వెళ్లినా సింపుల్ గా ఉన్నాడు. వ్యక్తితం ఉన్నవాడు. మా బంగారం, నా తమ్ముడు.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేవాడు చరణ్. ఇంకా విజయాలు సాధించాలి అని బాబాయ్ గా కాదు అన్నగా ఆశీర్వదిస్తున్నాను అని అన్నారు.
దీంతో బాబాయ్ అబ్బాయి బాండింగ్ చూసి, చరణ్ గురించి పవన్ గొప్పగా మాట్లాడిన మాటలు విని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also See : Ram Charan – Pawan Kalyan : బాబాయ్ – అబ్బాయి బాండింగ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..