Pawan Kalyan : ఏపీలో ఫిలిం స్కూల్స్ పెట్టండి.. స్టూడియోలు కట్టండి.. ఏపీని చిన్నచూపు చూడొద్దు..
నిర్మాత దిల్ రాజు కూడా రావడంతో ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారు.

Pawan Kalyan Comments on Film Industry Development in Andhra Pradesh at Game Changer Pre Release Event
Pawan Kalyan : నేడు జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. నిర్మాత దిల్ రాజు కూడా రావడంతో ఆయన్ని ఉద్దేశించి మాట్లాడారు.
Also See : Ram Charan – Pawan Kalyan : బాబాయ్ – అబ్బాయి బాండింగ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారు మీరు తెలంగాణ FDC చైర్మన్ కదా. మీరు ఏపీని చిన్న చూపు చూడకండి. అదొక్కటే నేను కోరుకుంటున్నా. తెలుగు పరిశ్రమ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో అద్భుతంగా ఉండాలి. ఇక్కడ యువతకు స్టంట్ స్కూల్స్ పెట్టండి, గోదావరి జిల్లాల్లో, కడపలో, రాయలసీమలో ఎక్కడైనా ఫిలిం స్కూల్స్ పెట్టండి. రాజమౌళి, త్రివిక్రమ్ గార్లను వచ్చి మా వాళ్లకు క్లాసులు చెప్పమనండి. తమన్, కీరవాణి గార్లను వచ్చి మ్యూజిక్ నేర్పించమనండి. ఇక్కడ స్టూడియోలు పెట్టండి. 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి స్కూల్స్ పెట్టండి. ఫిలిం స్కూల్స్ పెట్టండి. మీ కోసం ఇంతమందికి వచ్చాం. మీకు టికెట్ రేట్లు పెంచాం. ఏపీ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. తెలుగు పరిశ్రమ నుంచి మేము కోరుకునేది ఒక్కటే. ఇక్కడ యువతకు ఉపాధి ఇవ్వండి. మా దగ్గర ముమ్మిడివరం, గోదావరి, గండికోట, సిద్దమఠం, మన్యం లాంటి అద్భుతమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు కలిపిస్తాం. ఇక్కడకి వచ్చి చేయండి షూటింగ్స్. తెలుగు పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ కోసం ఒళ్ళు వంచి మరీ పనిచేస్తాను అని అన్నారు.
మరి పవన్ కళ్యాణ్ మాటలు నిర్మాతలు, టాలీవుడ్ పెద్దలు సీరియస్ గా తీసుకొని ఏపీలో సినిమా షూటింగ్స్ పెంచి స్టూడియోలు, ఫిలిం స్కూల్స్ పెడతారా చూడాలి.
Also Read : Kandula Durgesh : సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నాం.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కామెంట్స్..