Kandula Durgesh : సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నాం.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కామెంట్స్..

ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ..

Kandula Durgesh : సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నాం.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కామెంట్స్..

AP Cinematography Minister Kandula Durgesh Comments in Game Changer Pre Release Event

Updated On : January 4, 2025 / 10:04 PM IST

Kandula Durgesh : నేడు రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులూ కూడా వచ్చారు. ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు.

Also See : Pawan Kalyan Full Speech : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..

ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ద్వారా రాష్ట్రంలో ఉన్న అంశాలు ప్రస్తావించేలా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నిర్మాతలు, దర్శకులు అందరికి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక సినిమా పాలసీని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఒక అందాల హరివిల్లు. అనేక రకాల ప్రకృతి సౌంద్యరులు ఉన్నాయి. అటువంటి రాష్ట్రంలో ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తరపున కోరుతున్నాను ఇక్కడ సినిమాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి ముందుకు రండి. సినిమా పరిశ్రమకు కూడా ఒక పాలసీ ఇచ్చి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది అని అన్నారు.