Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు ఇక్కడ..

మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు ఇక్కడ..

Balakrishna Daaku Maharaaj Movie Trailer Released

Updated On : January 5, 2025 / 8:45 AM IST

Daaku Maharaaj Trailer : బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Pawan Kalyan : రామ్ చరణ్ పేరు వెనక కథ చెప్పిన పవన్.. సంవత్సరంలో 100 రోజులు మాలలోనే.. చెప్పులు లేకుండా..

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నేడు అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ఈ ట్రైలర్ చూస్తుంటే.. బాలయ్య డబల్ రోల్ అని, ఒకటి ప్రస్తుతం జరిగే కథ, మరోటి పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తుంది. చిన్న పాప ఎమోషన్ తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ అదుర్స్. ఇలాంటివి సినిమాలో చాల డైలాగ్స్ ఉండనున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో బాబీ దర్శకత్వలో డాకు మహారాజ్ తెరకెక్కుతుంది. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ముఖ్య పాత్రల్లో నటించారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల హిట్స్ తో ఫేమ్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాతో కూడా మరో హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

Also See : ఖుషి సమయంలో మా ఇద్దరికీ గొడవ అయింది.. SJ సూర్యపై పవన్ కామెంట్స్..