Ram Charan : కళ్యాణ్ బాబాయ్ కి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు.. పవన్, చిరు, నాగబాబులపై చరణ్ కామెంట్స్..

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు చరణ్.

Ram Charan Interesting Comments on Pawan Kalyan Nagababu and Chiranjeevi in Balakrishna Unstoppable Show

Ram Charan : రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి(Chiranjeevi)తోనే కాక బాబాయ్ లు పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగబాబులతో కూడా చాలా సన్నిహితంగా ఉంటారని తెలిసిందే. ముఖ్యంగా పవన్ – చరణ్ అనుబంధం గురించి అందరికి తెలుసు. చరణ్ చిన్నప్పుడు ఎక్కువగా పవన్ దగ్గరే పెరిగాడని ఇద్దరూ పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా రామ్ చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చాడు.

ఈ షోలో అనేక విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు చరణ్. బాలకృష్ణ చిరంజీవి, నాగబాబు, పవన్ కలిసి ఉన్న ఫోటోని చూపించి వాళ్ళ ముగ్గురి గురించి పలు ప్రశ్నలు అడిగారు.

Also Read : Nithya Menen : సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానన్న స్టార్ హీరోయిన్ .. నేషనల్ అవార్డు రావడంతో..

చరణ్ సమాధానమిస్తూ.. నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో ఆయనతో మాట్లాడలేను కాబట్టి బాబాయ్ తోనే అన్ని షేర్ చేసుకుంటాను. నాన్న షూటింగ్ లో ఉంటారు కాబట్టి కళ్యాణ్ బాబాయ్ కి అప్పచెప్పేవారు నన్ను. ట్యూషన్స్ నుంచి హార్స్ రైడింగ్ వరకు అన్నిటికి తీసుకెళ్లాలని కళ్యాణ్ గారికి షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు. ఇంటికొచ్చాక మాత్రం ఫుడ్, హోమ్ వర్క్ నాగ్ బాబాయ్ చూసుకునేవారు. చిన్నప్పుడు ఎక్కువ సమయం కళ్యాణ్ బాబాయ్ తోనే గడిపాను అని అన్నారు.

వారి వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతూ.. ఎక్కువ ఓపిక ఉండాలని సలహా ఇచ్చారు కళ్యాణ్ బాబాయ్. ఆయనకు చాలా ఓపిక. దేన్నైనా భరిస్తారు. భరించే తత్త్వం ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. డాడీ అయితే పెద్దలకు మర్యాద ఇవ్వమని చెపుతారు. ఆ విషయంలో ఊరుకోరు. నాగబాబు బాబాయ్ చాలా సరదా మనిషి. ఆయన వేసే జోకులకు బాగా నవ్వుతాం. డాడీ సైలెంట్ గా ఉంటారు. కళ్యాణ్ బాబాయ్ బాగా సైలెంట్. నాగబాబు బాబాయ్ సరదా మనిషి. కళ్యాణ్ బాబాయ్ లెగో బొమ్మలు, బుక్స్ లతోనే గడిపేసేవారు. ఆయన దగ్గర రెండు రూమ్స్ కలెక్షన్ బుక్స్ ఉన్నాయి అని తెలిపారు.

Also Read : Hollywood : తగలబడుతున్న హాలీవుడ్.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా మంటల్లో..

ఇక వీరి ముగ్గురులో పార్టీకి ఎవరితో వెళ్తావు అని అడగ్గా.. ముగ్గురు పార్టీలకి వెళ్లరు. అరవింద్ మామతో వెళ్తాను. ఈ విషయంలో ఆయన బెస్ట్. చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఆయనే తీసుకెళ్లేవారు అని తెలిపారు. ఇక చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రేపు జనవరి 10న రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా భారీగా తెరకెక్కించారు. అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర.. పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించగా ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.