Ram Charan – Janhvi Kapoor : అప్పుడే RC 16 పనులు మొదలుపెట్టేశారా? చరణ్‌తో జాన్వీ డిస్కషన్స్.. ఫొటోలు వైరల్..

ఓ పక్క పూజా కార్యక్రమం ఫొటోలు వైరల్ అవుతుంటే మరోపక్క రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు డిస్కషన్స్ చేసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Ram Charan – Janhvi Kapoor : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. సంయుక్త నిర్మాణంలో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. నిన్న మార్చ్ 20న RC16 సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు, మూవీ యూనిట్ తో పాటు సుకుమార్, చిరంజీవి, బోని కపూర్, శంకర్, ఏఆర్ రహమాన్.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో చరణ్, జాన్వీ కపూర్ పక్కపక్కనే ఉన్న ఫొటోలు, వీడియోలు నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, శ్రీదేవిలని ప్రస్తావిస్తూ మళ్ళీ జగదేకవీరుడు – అతిలోక సుందరి జంట గుర్తొస్తుంది అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : James Bond : త్వరలో కొత్త జేమ్స్ బాండ్.. డేనియల్ క్రేగ్ తప్పుకున్నట్టే.. ఎవరా కొత్త హీరో?

అయితే ఓ పక్క పూజా కార్యక్రమం ఫొటోలు వైరల్ అవుతుంటే మరోపక్క రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు డిస్కషన్స్ చేసుకుంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఓ ఫొటోలో అయితే రామ్ చరణ్ మాట్లాడుతుంటే జాన్వీ చరణ్ నే చూస్తూ శ్రద్దగా వింటున్నట్టు ఉంది. చరణ్ ఇంట్లోనే నిన్న సాయంత్రం చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సినిమా గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో వర్క్ షాప్ కూడా పెడతారని సమాచారం. దీంతో జాన్వీ, చరణ్ డిస్కషన్ చేసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట భలే క్యూట్ గా ఉన్నారు, సినిమాలో ఇంకెలా మెప్పిస్తారో అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

 

ట్రెండింగ్ వార్తలు