Ram Charan Latest Look: లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. తమ రోజువారీ మరియు లేటెస్ట్ అప్‌డేట్లతో ఫ్యాన్స్, నెటిజన్లకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్ట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఇప్పటికే సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియో విడుదల చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. ఆ వీడియోలో కండలు తిరిగిన శరీరంతో, సిక్స్‌ప్యాక్ బాడీతో చెర్రీ అద్భుతంగా కనిపించాడు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చెర్రీ పోస్ట్ చేసిన ఫొటో మెగాభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. తీక్షణంగా చూస్తున్న చెర్రీ సైడ్ ప్రొఫైల్ లుక్ అందర్నీ చాలా బాగుంది. ‘సాధ్యమైనంత ఉన్నతంగా ఉండండి’ (Be the best possible version of urself!) అని చెర్రీ చేసిన కామెంట్ ఆకట్టుకుంటోంది.