Ram Charan made interesting comments on working with Rahman for Peddi movie.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. (Ram Charan)పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్ది పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తక్కకుండా సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇక రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
Gouri Kishan: నన్ను క్షమించండి.. సరదాగా అడిగాను.. మానసిక ఒత్తడికి గురయ్యాను..
గతంలో ఎన్నడూ లేని విదంగా పెద్ద గురించి పాజిటీవ్ గా మాట్లాడుతున్నాడు. అందుకే, ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి చికిరి సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఏఆర్ రహమాన్ సంగీతమ్ అందించిన ఈ పాట సూపర్ హిట్ గా నిలిచింది. రహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్స్, జాన్వీ అందాలు, మోహిత్ చౌహాన్ అద్భుతమైన వాయిస్ కలిసి పాటను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. దీంతో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే రికార్డ్స్ వ్యూస్ సాధించింది ఈ పాట.
ఇదిలా ఉంటే, తాజాగా హైదరాబాద్ లో ఏఆర్ రహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ జరిగింది. రహమాన్ తాను చేసిన పాటలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. భారీగా జరిగిన ఈ ఈవెంట్ కి పెద్ది టీం రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సనా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రహమాన్ గారితో సినిమా చేయడం అనేది నా చిన్న నాటికల. అది నాకు బాగా నచ్చిన పెద్ది లాంటి కథతో నిజం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. చికిరి సాంగ్ అదిరిపోయింది. సినిమా కూడా మీకు తప్పకుండా నచుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పెద్ది సినిమాపై రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే పెద్ది సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.