Gouri Kishan: నన్ను క్షమించండి.. సరదాగా అడిగాను.. మానసిక ఒత్తడికి గురయ్యాను..

ఈమధ్య సినిమా రిపోర్టర్స్ కాస్త హద్దులు దాటుతున్నారు అనేది నమ్మాల్సిన నిజం. (Gouri Kishan)సినిమాకు అవసరం లేని ప్రశ్నలను యాక్టర్స్ పై సంధిస్తూ వారిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Gouri Kishan: నన్ను క్షమించండి.. సరదాగా అడిగాను.. మానసిక ఒత్తడికి గురయ్యాను..

Reporter apologizes for Gauri Kishan incident

Updated On : November 9, 2025 / 5:00 PM IST

Gouri Kishan: ఈమధ్య సినిమా రిపోర్టర్స్ కాస్త హద్దులు దాటుతున్నారు అనేది నమ్మాల్సిన నిజం. సినిమాకు అవసరం లేని ప్రశ్నలను యాక్టర్స్ పై సంధిస్తూ వారిని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అవి కూడా కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పటికీ.. (Gouri Kishan)కొన్నిసార్లు బెడిసికొడుతున్నాయి. ఇటీవలే మంచు లక్ష్మి ఇన్సిడెంట్ ఎక్కడివరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. అయితే, ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కాదు చెన్నైలో. 96 ఫేమ్ గౌరీ కిషన్ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ అదర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న గౌరీని మీ బరువు ఎంత అని అడిగాడు ఒక రిపోర్టర్.

SSMB 29: మరో సర్ ప్రైజ్.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే?

దానికి చాలా సీరియస్ అయ్యింది నటి గౌరీ కిషన్. నేను ఒక సినిమా చేసాను. దాని గురించి అడగండి. నా బరువు గురించి మీకు ఎందుకు. దానికి మా సినిమాకి ఏంటి సంబంధం. ఒకరకంగా మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు. కాస్త విలువలు పాటించండి అంటూ మండిపడింది. అయితే, ఈ ఘటన చాలా సీరియస్ గా మారింది. తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో నటి గౌరీ వెనుక నిలబడింది. దీంతో తప్పు తెలుసుకున్నఆ రిపోర్టర్ క్షమాపణ చెప్తూ వీడియో విడుదల చేశాడు.

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “నేను గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. నేను వేరే ఉద్దేశంలో ప్రశ్న అడిగాను. కానీ, అది గౌరీ కిషన్ కి వేరేలా అర్థం అయ్యింది. నేను ఈ ప్రశ్న అడగడం వలన ఆమె మనసు బాధపడి ఉంటే, దానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. కానీ, ఆమెను నొప్పించడం నా ఉద్దేశం కాదు. సినిమాలో హీరో ఆమెను ఎత్తుకునే సీన్ ఉంది. దానికి రిలేటెడ్ గా ఉంటుందని సరదాగా అడిగాను. దానిని గౌరీ చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని”వివరించాడు. దీంతి, ఆ రిపోర్టర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.