SSMB 29: మరో సర్ ప్రైజ్.. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా వస్తున్న (SSMB 29)విషయం తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Priyanka Chopra first look from ssmb29 movie releasing soon
SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ రేంజ్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు (SSMB 29)జక్కన్న. ఇక నిర్మాతలు సైతం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవడంలలేదు. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమా టైటిల్, మహేష్ బాబు లుక్, టీజర్ ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జియో హాట్ స్టార్ లో ఈ ఈవెంట్ స్ట్రీమ్ కానుంది. దీంతో, ఇండియన్ సినీ లవర్స్ అందరు ఈ ఈవెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, అంతకన్నా ముందే ప్రేక్షకులకు భారీ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే, ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న పృద్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తి “కుంభ” గా ఆయన లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. రోబోటిక్ వీల్ చైర్ లో కూర్చున్న ఆయన లుక్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అలాగే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనే చిన్న హిట్ కూడా ఇచ్చేసింది.
ఇక ఈ ఫస్ట్ లుక్ తరువాత మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అదేంటంటే, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 11న ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నాడట. ముందు ఇచ్చిన అప్డేట్ లాగే ఈ అప్డేట్ కూడా అదేరోజు అనౌన్స్ చేసి విడుదల చేయనున్నారట. ఇలా చెప్పకుండానే వరుసగా సూపర్ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు ఎలాగూ లేట్ అవుతుంది కనీసం అప్డేట్స్ అయినా అడగకుండానే ఇస్తున్నాడు జక్కన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా లుక్ ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
