Ram Charan : మరో కొత్త హెయిర్ స్టైల్‌తో రామ్ చరణ్.. ఏమున్నాడ్రా బాబు.. లుక్ అదిరింది..
తాజాగా మరోసారి రామ్ చరణ్ కి కొత్త హెయిర్ స్టైల్ చేసిన అలీమ్ ఖాన్ చరణ్ ఫొటోని, చరణ్ తో దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published On : February 13, 2024 / 01:19 PM IST
Ram Charan New Hair Style by Aalim Hakim Photos goes Viral
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం నాలుగైదు లుక్స్ తో కనిపించాడు రామ్ చరణ్. ఎప్పటికప్పుడు కొత్త హెయిర్ స్టైల్, కొత్త లుక్ తో కనపడి అభిమానులని మెప్పిస్తున్నాడు చరణ్. తాజాగా రామ్ చరణ్ మరో కొత్త హెయిర్ స్టైల్, కొత్త లుక్స్ తో కనిపంచి ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్(Aalim Hakim) రెగ్యులర్ గా టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలకు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ చేస్తాడని తెలిసిందే. చరణ్ కి కూడా గతంలో రెండు, మూడు సార్లు కొత్త హెయిర్ స్టైల్స్ చేసి ఆ ఫోటోలని పోస్ట్ చేసాడు. తాజాగా మరోసారి రామ్ చరణ్ కి కొత్త హెయిర్ స్టైల్ చేసిన అలీమ్ ఖాన్ చరణ్ ఫొటోని, చరణ్ తో దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఇంకేముంది.. చరణ్ కొత్త హెయిర్ స్టైల్, కొత్త లుక్ అంటూ ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో చరణ్ వైట్ టీషర్ట్ వేసుకొని, కళ్ళజోడు పెట్టుకొని, సరికొత్త హెయిర్ స్టైల్ తో అదరగొట్టేసాడు. చరణ్ ని ఈ లుక్ లో చూసి ఏమున్నాడ్రా బాబు.. లుక్ మాత్రం అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
