Puneeth Rajkumar : పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్

నిన్న నాగార్జున వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా పూణేలో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఇవాళ ఉదయం బెంగుళూరు వెళ్లారు. పునీత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి తర్వాత

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా అయనని చివరి చూపు చూడటానికి వెళ్లారు. ఆయన మరణం కేవలం కన్నడ సినీ పరిశ్రమనే కాక వేరే సినీ పరిశ్రమలని కూడా కంటతడి పెట్టించింది. పునీత్ కి, పునీత్ నాన్న శివ రాజ్ కుమార్ కి తెలుగు చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలు ఉండటంతో తెలుగు సెలబ్రిటీలు చాలా మంది ఆయన చనిపోయిన రోజు వెళ్లి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, నరేష్, శివ బాలాజీ, మంచు మనోజ్.. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఆయన చనిపోయిన రోజు వెళ్లి నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు.

Samantha : కరోనా కోసం కదిలొచ్చిన సమంత, మంచు లక్ష్మి

ఆ రోజు షూటింగ్స్ వల్ల లేదా వేరే ఇతర కారణాల వల్ల వెళ్లలేకపోయిన సెలబ్రిటీలు ఇప్పుడు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సమాధికి నివాళులు అర్పిస్తున్నారు. నిన్న నాగార్జున వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా పూణేలో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఇవాళ ఉదయం బెంగుళూరు వెళ్లారు. పునీత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి తర్వాత ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Shakini Dakini : శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా..

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా సొంత కుటుంబ సభ్యుడిలా ఉండే వారు పునీత్. అలాంటి వ్యక్తి మరణించడం నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన చాలా మంచి మనిషి. మా ఇంటికి చాలా సార్లు వచ్చారు. ఆయన దగ్గర మంచితనం నేర్చుకోవాలి. ఇలాంటి వ్యక్తి ఇంత తొందరగా చనిపోవడం బాధాకరం అంటూ ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు రామ్ చరణ్.

ట్రెండింగ్ వార్తలు