×
Ad

Peddi Song : చికిరి.. చికిరి.. పాటకు బామ్మా స్టెప్పులు అదుర్స్.. చరణ్ ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్..

ఇటీవల రిలీజయిన చికిరి.. చికిరి.. సాంగ్ బాగా వైరల్ అయింది. (Peddi Song)

Peddi Song

Peddi Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో పెద్ది సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్, చికిరి.. చికిరి సాంగ్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నాల్కోన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు.(Peddi Song)

ఈ క్రమంలోనే ఇటీవల రిలీజయిన చికిరి.. చికిరి.. సాంగ్ బాగా వైరల్ అయింది. ఈ పాటకు రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్ లు వేయడంతో ఫ్యాన్స్, రీల్స్ లో చరణ్ స్టెపును అందరూ తెగ ట్రై చేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ రామ్ చరణ్ చికిరి.. చికిరి.. సాంగ్ కి స్టెప్ వేయడం వైరల్ గా మారింది.

Also Read : Samantha Raj Nidimoru : సమంత – రాజ్ పెళ్లి నుంచి.. మరిన్ని ఫోటోలు చూశారా?

ఓ ఫంక్షన్ లో ఓ బామ్మ చరణ్ చికిరి.. చికిరి.. పాటకు రామ చరణ్ వేసినట్లే స్టెప్స్ వేయడానికి ప్రయత్నించింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఫ్యాన్స్ బామ్మ చేసిన చరణ్ స్టెప్ ని వైరల్ చేస్తూ పాట ఓ రేంజ్ లో హిట్ అయింది, వయసుతో సంబంధం లేకుండా బామ్మ కూడా పాట ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు అదరగొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రిలీజ్ కి చాలా టైం ఉండగానే చరణ్ పెద్ది సినిమాకు బాగా హైప్ వస్తుంది అని భావిస్తున్నారు.