×
Ad

Pawan Kalyan : బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం.. పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టడంతో ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ నెలకొంది. (Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : రామ్ చరణ్ పెద్ది సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. 2026 మార్చ్ 26 కి ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అదే రోజు నాని పారడైజ్ సినిమా కూడా రిలీజ్ కి ప్రకటించారు. మరి అప్పటివరకు ఈ రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుందో, ఏది వాయిదా పడుతుందో అని చర్చ జరుగుతుంది.(Pawan Kalyan)

అనూహ్యంగా ఈ డేట్ లోకి పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకు అంత హైప్ లేకపోయినా ఇది రీమేక్ కాదని చెప్పడం, ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టడంతో ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ నెలకొంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Rajamouli : ఇండియాలో ‘అవతార్’ ప్రమోషన్స్ చేస్తున్న రాజమౌళి.. జేమ్స్ కామెరాన్ తో స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ..

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని మార్చ్ 26 కే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పెద్ది, పారడైజ్ అయితే ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26 కి వస్తుందని, ఆ రెండు సినిమాలు వాయిదా పడతాయని టాక్.

పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అడగకపోయినా కచ్చితంగా వేరే సినిమాలు తప్పుకుంటాయి. చరణ్ తన బాబాయ్ సినిమా కాబట్టి కచ్చితంగా తప్పుకుంటాడు. దీంతో పెద్ది, పారడైజ్ సినిమాలు సమ్మర్ లో ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ అవుతాయని అంటున్నారు. మొన్నే OG తో భారీ సక్సెస్ కొట్టిన సంతోషంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రెడీ అవుతున్నారు.

Also Read : Rowdy Janardhan : రౌడీ ఫ్యాన్స్ కి నిరాశే.. ‘రౌడీ జనార్దన్’ టీజర్ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..