Peddi Glimpse : ‘పెద్ది’ గ్లింప్స్ కి దేవి హెల్ప్?

గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

Ram Charan Peddi Movie Update

గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ న‌టిస్తున్న‌ పెద్ది గ్లింప్స్ కోసం ఫ్యాన్స్‌ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు. రామ్‌చరణ్‌ బర్త్‌డేకు గ్లింప్స్ వస్తుందనుకుంటే రాలేదు, ఉగాదికి వస్తుందని అనుకుంటే నిరాశే మిగిలింది. ఇంతకీ రామ్‌చరణ్‌ గ్లింప్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? పెద్ది గ్లింప్స్ వచ్చే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారా..?

గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బ‌స్టర్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ మూవీకి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను రామ్ చ‌ర‌ణ్ బర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న విడుద‌ల చేశారు. దీంతో అంద‌రిలో అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. ఇందులో రామ్ చ‌ర‌ణ్ లుక్స్ ప్రేక్షకుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లో రామ్ చ‌ర‌ణ్ మాస్ అవ‌తార్‌ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

పెద్ది సినిమా నుంచి పోస్టర్ అయితే వచ్చింది. కానీ గ్లింప్స్ ఇంకెప్పుడు అంటూ మెగా ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తున్నారు. నిజానికి రామ్‌చరణ్‌ బర్త్‌డే రోజున గ్లింప్స్ వస్తుందనుకున్నారు. ఇటు ఉగాదికి వస్తుందనుకుంటే అది కుదురలేదు. అయితే గ్లింప్స్ ఇంకా రెడీ కాలేదని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఆర్ ఆర్ ఇవ్వాలంటే కాస్త టైమ్‌ పడుతుంది. దీనికి తోడు ఏఆర్ రెహమాన్ కొద్దిరోజులుగా సిక్ అవ్వడంతో గ్లింప్స్ మేకింగ్ పెండింగ్‌లో పడింది.

Nandamuri Kalyan Ram : ఈ సినిమా 20ఏళ్లు గుర్తుండిపోతుంది- నరసరావుపేటలో సందడి చేసిన నందమూరి కల్యాణ్ రామ్

దీంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హెల్ప్‌తో శ్రీరామ నవమికి పెద్ది గ్లింప్స్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్. మ‌రో మెట్టుకు తీసుకెళ్లేలా పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్‌. ‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ మూవీ నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుద‌లవుతుంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. అందులో క్రీడా మైదానంలోకి డైన‌మిక్‌గా దూకుతోన్న రామ్ చ‌ర‌ణ్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్‌తో గ్లింప్స్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి మ‌రింత పెరిగింది.