Ram Charan : ది రోర్ ఆఫ్ రామ్.. అదిరిపోయే లుక్స్ తో నేషనల్ మ్యాగజైన్ పై రామ్ చరణ్..

చరణ్ ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన India Today Conclave ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. తాజాగా నేషనల్ మ్యాగజైన్.................

Ram Charan photo on India Today Magazine goes viral

Ram Charan :  RRR సినిమా తర్వాత చరణ్(Charan), ఎన్టీఆర్(NTR), రాజమౌళికి(Rajamouli) దేశ, విదేశాల్లో మంచి గుర్తింపు, పాపులారిటీ బాగా వచ్చిన సంగతి తెలిసిందే. నార్త్ లో అయితే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇక RRR సక్సెస్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి నార్త్ లో పలు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. కొన్ని కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. నేషనల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నేషనల్ మీడియాలో రెగ్యులర్ గా వీరిగురించి ఆర్టికల్స్ రాస్తున్నారు.

ఇటీవలే చరణ్ ఆస్కార్ వేడుక అనంతరం ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన India Today Conclave ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నాడు. తాజాగా నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ ఫొటోగా రామ్ చరణ్ ఫొటో వేశారు. బ్లాక్ డ్రెస్ లో క్లోజ్ ఫొటోలో అదిరిపోయే లుక్స్ తో ఈ ఫొటో ఉంది. అలాగే మ్యాగజైన్ పై ది రోర్ ఆఫ్ రామ్ అని వేశారు. ఇంకో పక్క RRR స్టార్ రామ్ చరణ్ అని వేశారు. ఈ ఫోటోని అధికారికంగా రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Aha Godari : శ్రీరామనవమి కానుకగా.. ఆహాలో ‘గోదారి’ పేరుతో స్పెషల్ డాక్యుమెంటరీ..

నేషనల్ మ్యాగజైన్ పై చరణ్ ఫొటో చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ ఫోటోని తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలో రామ్ చరణ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.